
ముందుగా బుడం దోసకాయలను తీసుకుని నీటిలో బాగా కడిగి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పుతో కూడా కడిగే చేదు కూడా పోతోంది.ఆ తర్వాత క్లీన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దానిలో నూనె వేసి, ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బుడం దోసకాయలు, ఉల్లిపాయలు తీసుకుని వేసి వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ పాన్ లో నూనె వేసి ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.

బుడం దోసకాయలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఒక కప్పు టమాటాలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, చింతపండు రసం పోసి ఉడికించాలి.

కూర గ్రేవీగా కావలి అనుకుంటే దానిలో వేయించిన రెండు గ్లాస్ లు నీళ్లు పోసి అలా ఉడకనివ్వాలి. మధ్యలో మసాలా పొడి వేసి రుచి చూసుకోవాలి. అంతే, వేడి వేడి బుడం దోసకాయ కూర రెడీ.