
మామిడి స్టిక్కీ రైస్ రెసిపీ : సమ్మర్లో వచ్చే మామిడి పండ్లతో చేసే స్పెషల్ ఫుడ్ ఈ మామిడి స్టిక్కీ రైస్. దీనిని మామిడి ముక్కలు, కొబ్బరి పాలతో ఉడికించిన స్టిక్కీ రైస్ చేస్తారు ఇంకా చెప్పాలంటే దీనిలో ఒక్క చుక్క కూడా నూనె వాడాల్సిన అవసరం లేదు. మంచి రుచి వస్తుంది. మన దగ్గర కంటే థాయ్‌లాండ్‌లో చాలా ఫేమస్. ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

మామిడి స్టిక్కీ రైస్ రెసిపీ కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు స్టిక్కీ రైస్, రెండు పండిన మామిడి పండ్లు, ఒక కప్పు కొబ్బరి పాలు, పావు కప్పు పంచదార, ఇంకా కొద్దిగా ఉప్పు, అలాగే నువ్వులు లేదా తెల్ల నువ్వులను తీసుకోవాలి. దీనిని మన ఇంట్లోనే కొద్దీ నిముషాల్లోనే చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని చదివి ట్రై చేయండి.

మామిడి స్టిక్కీ రైస్ తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని సిద్ధం చేసుకోవాలి అంటే స్టిక్కీ రైస్‌ను కనీసం 4 నుంచి 5 గంటలు పాటు వీటిని రాత్రంతా బాగా నానబెట్టాలి. ఇంకా మీరు వీటిని దీనిలో ఉన్న నీటిని వంపేసి సన్నని మంట ఆవిరిపై 30 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేస్తే మెత్తగా అవుతుంది తినడానికి మంచిగా అవుతుంది.

కొబ్బరి పాలు మిశ్రమం : అయితే ఒక చిన్న పాత్రలో కొబ్బరి పాలు ఇంకా ఒక కప్పు పంచదార, ఇంకా చిటికెడు ఉప్పు కూడా వేసి దీనిని బాగా వేడి చేసుకోవాలి అలాగే, పంచదార కూడా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తరవాత ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ ను కూడా దీనిలో వేసుకోవాలి. ఇక చివర్లో స్టిక్కీ రైస్‌లో కొబ్బరి పాలను పోసి కలపాలి.

అయితే దీనిమీద కనీసం 15 నిమిషాల పాటు మూతపెట్టి ఉంచాలి. ఇంకా రైస్ కొబ్బరి పాల రుచిని కూడా పీల్చుకుని మంచి రుచిని ఇస్తుంది. మామిడి పండును పొట్టును తీసి కొంచం పెద్దగా ముక్కలు కోసుకోవాలి. ఇంకా ఒక ప్లేట్‌లో స్టిక్కీ రైస్ కూడా పెట్టి దానిలో మామిడి ముక్కలు పెట్టాలి అలాగే పై నుంచి తెల్ల నువ్వులు కూడా దీని మీద చల్లుకోవాలి.