క్యారెట్ దోశ.. ఇలా చేస్తే పిల్లలతో పాటు పెద్దలు కూడా లాగిస్తారు

Updated on: Mar 29, 2026 | 9:06 AM

Carrot dosa recipe in telugu: క్యారెట్ దోశ ఒకసారి చేసుకుంటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. ఇలా చేస్తే పిల్లలతో పాటు పెద్దలు కూడా లాగిస్తారు ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్ధాలు , తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు తురిమిన క్యారెట్ ముక్కలు, రెండు గ్లాస్ ల నీళ్ళు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 4 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు,  మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5
పిండి ఈ విధంగా కలుపుకోవాలి: ఒక గిన్నెలో తురిమిన క్యారెట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , పచ్చిమిర్చి ముక్కలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పును వేసి  మిక్స్ అయ్యేలా కలుపుకుంటాను.

3 / 5
నీరు పోయడం: ఈ పిండిలో తగినంత నీరు పోసి , దోశ పిండి లాగా జోరుగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పెనంపై దోస పలుచగా వేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి, ఈ పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి.

4 / 5
ఇలా దోశ వేసుకోవాలి : ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెనం పెట్టి దానిలో నూనె వేసి , కొద్దిగా ఆయిల్ రాసి, అది వేడయ్యాక పిండిని దోశలాగా పలుచుగా వేసుకోవాలి.

5 / 5
దోశను రెండు వైపులా కాల్చుకోవాలి :  పెనం పై దోశ లాగా పోసి అది ఒక వైపు కాలిన తర్వాత, రెండో వైపు కూడా బాగా బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన దోశను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

Follow Us