
చియా సీడ్స్: జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చియా సీడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విత్తనాల్లో ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ను హైడ్రేటెడ్‌గా ఉంచి, పొడిబారడం, చుండ్రును తగ్గిస్తాయి. అలాగే జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి.

అవిసె గింజలు : అవిసె గింజల్లో విటమిన్ E, B కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు విరిగిపోకుండా కాపాడతాయి. అంతేకాదు జుట్టును దృఢంగా మార్చడమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యత కారణంగా రాలే జుట్టు సమస్యను తగ్గిస్తాయి. అలానే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుమ్మడి గింజలు: జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే కొత్త జుట్టు మొలవడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి.

పొద్దుతిరుగుడు గింజలు : ఇవి విటమిన్ E కి గొప్ప మూలం. ఇవి స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగు పరిచి జుట్టును బలంగా మార్చుతాయి. అలాగే జుట్టును మెరుస్తూ ఉండేలా చేస్తాయి. అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. ఇవే కాదు నల్ల నువ్వులు కూడా జుట్టుకు మేలు చేస్తాయి. ఇవి జుట్టు సహజమైన నలుపు రంగును ఇస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.

మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే, ఈ విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి తక్కువ ధరలో లభించడమే కాకుండా సహజంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో పాటు ఈ గింజలను తీసుకోవడం వల్ల మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా, కాంతివంతంగా మారుతుంది.