
రోజంతా ఉత్తేజంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి. అలాగే పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ బాగా తీసుకోవాలి. ఫలితంగా రోజంతా శక్తివంతంగా ఉంటారు.

అలోవెరా జ్యూస్ రుచి చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తీసుకోవడ వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఉదయాన్నే నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోకి చియా విత్తనాలను కూడా జోడించవచ్చు. ఇది మీకు రోజును ప్రారంభించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. బరువు తగ్గడానికి, శరీరంలో రోగనిరోధక శక్తికి కూడా సహాయపడుతుంది.

ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే డ్రింక్స్‌తో రోజును ప్రారంభిస్తే చాలామందిని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పాలకూర, కాలే మొదలైన వాటితో కలిపి ఈ హెల్త్ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. మీకు నచ్చిన కూరగాయలు లేదా పండ్లను కూడా ఇందులో చేర్చుకోవచ్చు.

కొబ్బరి నీళ్లతో రోజును ప్రారంభించండి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేకురుస్తాయి. దీనికి తోడు సమ్మర్‌లో హైడ్రేటెడ్ గా ఉండడానికి ఈ కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడతాయి.

పొట్ట తగ్గాలంటే గ్రీన్ టీతో రోజును ప్రారంభించడం మంచిది. ఈ టీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు గ్రీన్ టీ జీవక్రియను కూడా పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.