Sesame seeds: చలికాలంలో నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..

|

Jan 04, 2025 | 3:25 PM

నువ్వులు..మనందరికీ తెలిసిందే..! ప్రతి వంటింట్లోనూ ఏదో ఒక సందర్భంలో నువ్వులు వాడుతుంటారు. ముఖ్యంగా పిండివంటలు చేసేందుకు నువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు. చలికాలంలో నువ్వులు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. నువ్వులు తినడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. చలికాలంలో నువ్వులు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
చలికాలంలో నువ్వులు తీసుకోవటం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఎందుకంటే నువ్వులు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి.  నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుండి వెచ్చగా ఉంటుంది. మీరు ప్రతిరోజు పాలతో పాటు నువ్వులను తినవచ్చు.

2 / 5
కొందరు మహిళ్లల్లో ఎదురయ్యే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను పోగొట్టడానికి నువ్వులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.  నువ్వులలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. నువ్వుల్లో ఎక్కువ మొత్తంలో జింక్ ఉంటుంది. ఇది శరీరంలో ప్రొజెస్టెరాన్ మొత్తాన్ని పెంచుతుంది. నువ్వులు పీరియడ్ చక్రాన్ని క్రమబద్ధం చేస్తుంది.

3 / 5
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నువ్వులు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి. నువ్వుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని సహాయంతో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. అధిక స్థాయి ఈస్ట్రోజెన్ గర్భాశయం సంకోచాన్ని ప్రేరేపిస్తుంది.

4 / 5
నువ్వులను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం క్రమబద్దీకరించబడుతుంది. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను పోగొట్టడానికి ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. 
నువ్వులు రుతుస్రావాన్ని ప్రేరేపిస్తాయి లేదా నియంత్రిస్తాయనే వాదనకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

నువ్వులను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం క్రమబద్దీకరించబడుతుంది. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను పోగొట్టడానికి ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. నువ్వులు రుతుస్రావాన్ని ప్రేరేపిస్తాయి లేదా నియంత్రిస్తాయనే వాదనకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
ఎముకల బలానికి నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. బోన్‌ హెల్త్‌ కోసం పనిచేసే కాల్షియం సహా అనేక పోషకాలు ఈ నువ్వుల్లో ఉంటాయి. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు నువ్వుల్లో లభిస్తాయి. మీరు క్రమరహిత రుతుచక్రం సమస్యను ఎదుర్కొంటుంటే.. దీని కోసం నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే నువ్వులను తినండి.