Guava Juice: రోజూ ఒక గ్లాస్ జామపండు జ్యూస్ తాగితే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు..

Updated on: Feb 17, 2026 | 8:05 AM

సాధారణంగా మనకు తక్కువ ధరలో, సులభంగా దొరికే పండ్లలో జామపండు ఒకటి. అయితే దీనిని కేవలం ఒక సామాన్యమైన పండుగా తీసిపారేయకండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జామపండులో ఉండే పోషకాలు ఖరీదైన బ్లూబెర్రీస్ వంటి పండ్లకు ఏమాత్రం తీసిపోవు. ముఖ్యంగా జామపండును ముక్కలుగా తినడమే కాకుండా రసం రూపంలో తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

1 / 6
ఎందుకు జామ రసం తీసుకోవాలి?: జామలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నారింజ పండుతో పోలిస్తే జామలో విటమిన్ సి శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

2 / 6
రోగనిరోధక శక్తికి బాసట: మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నుండి తప్పించుకోవాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ప్రతిరోజూ జామ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. తద్వారా తరచూ అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చు.

3 / 6
మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం: జామపండు తీయ్యగా ఉన్నప్పటికీ.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి భయం లేకుండా జామ రసాన్ని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు.

4 / 6
గుండె ఆరోగ్యం: జామలో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు జామ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

5 / 6
జీర్ణక్రియ: జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొంతమందికి జామకాయను నేరుగా తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు రసం రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

6 / 6
మెరిసే చర్మం.. దృఢమైన జుట్టు: జామ రసం కేవలం అంతర్గత ఆరోగ్యానికే కాదు, బాహ్య సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి సహజమైన మెరుపును ఇవ్వడమే కాకుండా జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

Follow Us