Hair Wash Guide: జుట్టు రాలడం ఆగాలంటే.. వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి?.. నిపులు చెప్పిన సీక్రెట్

Updated on: Mar 13, 2026 | 1:18 PM

మనం అందంగా కనిపించాలంటే చక్కని ముఖం, మంచి డ్రెస్ ఉంటే మాత్రమే సరిపోదు మంచి హెయిర్ స్టైల్ కూడా ఎంతో ముఖ్యం. అందుకే చాలా మంది జుట్టును కాపాడుకోవడానికి దానికి ఎక్కవగా శ్రద్ధ పెడతారు. కానీ ఈ మధ్య కాలంలో మారుతున్న లైఫ్‌స్టైల్, కొన్ని ఇతర అలవాట్ల కారణంగా చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ మనం రోజూ చేసే స్నానం కూడా ఒక కారణం అంటున్నారు నిపుణులు. అవును అతిగా తలస్నానం చేసినా లేదా అస్సలు చేయకపోయినా జుట్టు రాలే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి జుట్టు ఆరోగ్యం ఉండాలన్నా.. హెయిర్ ఫాల్ కాకూడదన్న వారంలో ఎన్ని రోజులు తల స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారం, పోల్యూషన్, మనం చేసే కొన్ని తప్పుల కారణంగా ఈ మధ్య జుట్టు రాలుడు సమస్య ఎక్కవైపోయింది. అయితే మనం చేసే కొన్ని తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాలు జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
జుట్టు రాలే విషయంలో మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే తల స్నానం కొందరు ప్రతి రోజూ తల స్నానం చేస్తారు. మరి కొందరు అస్సలు తన స్నానమే చేయరు. ఈ రెండు మన జట్టు రాలుడుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వారి జుట్టు రకాన్ని బట్టి కూడా మారుతుందని అంటున్నారు. అంటే జుట్టు రాలకుండా ఉండాలంటే వారంలో పోడి జుట్టు ఉన్నవారు ఎన్ని రోజులు, జిడ్డుగా జుట్టు ఉన్నవారు ఎన్ని రోజులు తల స్నానం చేయాలో తెలుసుకుందాం.

3 / 5
జిడ్డు జుట్టు: కొంతమంది జుట్టు ఎప్పుడూ జిడ్డుగానే ఉంటుంది. వీరి తలపై స్కాల్ప్ ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది. కాబట్టి వీరు తలలో ఉన్న జిడ్డును తొలగించుకోవాలి అంటే మం షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి. ఇలాంటి వ్యక్తులు 3 నుండి 4 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. లేకపోతే జిడ్డు వల్ల ధూళి చేరి జుట్టు కుదుళ్లు బలహీనపడి హెయిర్ ఫాల్ పెరిగే అవకాశం ఉంటుంది.

4 / 5
పొడి జుట్టు : చాలా మంది హయిర్ చాలా పొడిగా ఉంటుంది. ఇలా జుట్టు ఉన్న వ్యక్తులు రోజూ తల స్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. అవును రోజూ స్నానం చేస్తే జుట్టులో ఉన్న సహజ సేవలు తొలగిపోతాయి. అప్పుడు జుట్టు పొడిగా మారి మరింత రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు బాగా డ్రైగా ఉంటే వారానికి 2 సార్లు మాత్రమే తల స్నానం చేయండి.

5 / 5
సాధారణ జుట్టు: ఇక సాదారణ జుట్టు ఉన్నవారు వారానికి 2 నుండి 3 సార్లు తల స్నానం చేయడం సరిపోతుంది. అయితే మీకు జుట్టు రాలకుండా ఉండాలంటే వీటితో పాటు మరి కొన్ని కూడా తెలుసుకోవాలి. ఎప్పుడూ చల్లని, లేదా గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయండి. అలాగే రసాయనాలు లేని షాంపూలను వాడండి. జుట్టు తడిగా ఉన్నప్పుడూ అస్సలు దువ్వకండి. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోండి.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆదారంగా ఆందించబడినవి.. వీటిని TV9 దృవీకరించట్లేదు)

Follow Us