2 నెలలు నిల్వ ఉండేలా వంకాయ పచ్చడి ఎప్పుడైనా చేశారా? రుచి చూస్తే ఫిదా అవుతారు

Updated on: Oct 24, 2026 | 2:51 PM

వంకాయ నిల్వ పచ్చడి తెలుగు వంటకాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే దీని రుచిని మాటల్లో చెప్పలేము. ఈ పచ్చడి ఇంట్లో ఉంటే, మరే కూర అవసరం లేకుండా భోజనాన్ని మంచిగా చేయవచ్చు. ఈ రెసిపీని ఇక్కడ చూసి మీరు కూడా రెండు నెలల వరకు నిల్వ ఉండే ఈ రుచికరమైన వంకాయ నిల్వ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

1 / 5
కావాల్సిన పదార్థాలు: వంకాయలు: 500 గ్రాములు, చింతపండు: నిమ్మకాయ సైజు,  వంట నూనె: 1 కప్పు (పల్లి లేదా నువ్వుల నూనె ఉత్తమం), ఆవాలు: 2 టీస్పూన్లు,  జీలకర్ర: 2 టీస్పూన్లు ,   మెంతులు: 1/4 టీస్పూన్,  ధనియాలు: 1 టేబుల్ స్పూన్,  శనగపప్పు: 1 టీస్పూన్, మినప్పప్పు: 1 టీస్పూన్,  వెల్లుల్లి రెబ్బలు: 1 ,  ఎండుమిరపకాయలు: 4-5 ,  కరివేపాకు: గుప్పెడు,  కారం పొడి: 1/2 కప్పు (లేదా రుచికి సరిపడా),  ఉప్పు: 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.

2 / 5
వంకాయల తయారీ: ముందుగా 500 గ్రాముల వంకాయలను నీటిలో శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి, వంకాయలపై తడి అస్సలు ఉండకూడదు. వెంటనే కట్ చేయకుండా, మిగిలిన తయారీకి ముందు కట్ చేయాలి, ఎందుకంటే అవి నల్లబడతాయి.

3 / 5

నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని, పిక్కలు, నారలు లేకుండా చూసుకోవాలి. దీనిని కొద్దిగా వేడి నీటిలో నానబెట్టాలి. చల్లటి నీటికి బదులుగా వేడి నీరు వాడాలి. చింతపండు మునిగేంత నీరు మాత్రమే పోయాలి. ఒక పాన్‌ తీసుకుని, అందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి తక్కువ మంటపై దోరగా రంగు మారేవరకు వేయించాలి. వేయించిన తర్వాత స్టవ్ ఆపి, చల్లార్చి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.

4 / 5

అదే పాన్‌లో 1 కప్పు వంట నూనె వేసి బాగా వేడి చేయాలి. పచ్చడికి నూనె ఎక్కువ ఉంటేనే నిల్వ ఉంటుంది. నూనె వేడెక్కేలోపు, వంకాయలను గుత్తి వంకాయల కోసం కట్ చేసినట్లుగా కట్ చేయాలి. లోపల పురుగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత, మంటను మీడియంలోకి తగ్గించి, కట్ చేసిన వంకాయలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వంకాయలు విడిపోకుండా, అవి కొద్దిగా మెత్తబడి రంగు మారే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లార్చాలి. వంకాయలు వేయించిన అదే నూనెలో 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ మినప్పప్పు, మిగిలిన ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత,  వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి వెల్లుల్లి గోల్డెన్ రంగులోకి మారేవరకు వేయించాలి.

5 / 5
నానబెట్టిన చింతపండును చేతితో బాగా పిసికి గుజ్జు తీసుకోవాలి లేదా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఈ గుజ్జును తాలింపులో వేసి తక్కువ మంటపై ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయే వరకు వేయించి, స్టవ్ ఆపి చల్లార్చాలి. ఒక మిక్సీ జార్‌లో 1/2 కప్పు కారం పొడి, ఒక పెద్ద పాయ వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. దీనిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని, ముందుగా చేసుకున్న మసాలా పొడిని కూడా కలిపి ఉండలు లేకుండా బాగా కలపాలి. చల్లారిన వంకాయల్లో ఈ కారం-మసాలా మిశ్రమాన్ని గుత్తి వంకాయలకు స్టఫ్ చేసినట్లుగా జాగ్రత్తగా నింపాలి. వంకాయలు వేయించినందువల్ల కొద్దిగా మెత్తగా ఉంటాయి కాబట్టి, అవి విడిపోకుండా చూసుకోవాలి. స్టఫ్ చేసిన వంకాయలను చల్లారిన తాలింపు నూనెలో వేసి, పచ్చడి బాగా కలిసేలా చేత్తో కలపాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us