
కావాల్సిన పదార్ధాలు : పాలు 3 కప్పులు,5 పండిన జామకాయలు 3, సేమియా , ఒక కప్పు బెల్లం తురుము, అర టీ స్పూన్ యాలకుల పొడి, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్‌మిస్ , మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి.

ముందుగా పండిన జామకాయలను తీసుకుని బాగా కడిగి దానిని మిక్సీలో పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి గింజలను పక్కకు పెట్టి, జామ గుజ్జును తీసుకోవాలి.

ఇక ఇప్పుడు ఒక పెద్ద పాన్ పెట్టి మూడు కప్పులు పాలు పోసి మరిగించాలి. అవి రంగు మారిన తర్వాత జామ గుజ్జును వేసి, మీడియం మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత ముందుగా వేయించుకున్న సేమియా , బెల్లం ముక్కలు, యాలకుల పొడి వేసి అది మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచండి. ఆ తర్వాత 5 బాదం, కిస్‌మిస్‌లు, 10 జీడిపప్పు,కూడా వేసి బాగా కలుపుకోవాలి.

స్టవ్ మీదే 10 నిముషాలు ఉంచి ఆ తర్వాత కిందకు దించేయండి. వేడి మీద ఈ జామకాయ సేమియా స్వీట్ తింటే గిన్నెల మీద గిన్నెలు లాగిస్తూనే ఉంటారు.