
మిరపకాయలు భారతీయ వంటకాలలో ప్రసిద్ధి కాంచాయి. ఇవి లేకుండా ఏ వంట వండినా అది అసంపూర్ణం. ఇక ఎరుపు, ఆకుపచ్చ రెండు రంగులలో మిరపకాయలు లభిస్తాయి. ఈ రెండింటి రుచులు, గుణాలు వేరు వేరు ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల విషయంలో కూడా మార్పులు ఉంటాయి. అవి ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఒకరకమైన రుచి, ఎండి పోయినప్పుడు మరింత ఘాటుగా ఉంటాయి. కాగా, వీటిలో ఇవే కాకుండా చాలా లేడాలు ఉంటాయంట. అవి ఏవో చూసేద్దాం.

పచ్చి మిరపకాయల విషయానికి వస్తే.. ఎరుపు రంగు మిరపకాయలతో పోలిస్తే పచ్చివి ఆరోగ్యానికి కాస్త ఎక్కువ మేలు చేస్తాయని చెప్పాలి. ఎందుకు అంటే? వీటిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కేలరీలు జీరోగా ఉంటాయి. అందువలన ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇవే కాకుండా పచ్చి మిరపకాయల్లో బీటీ కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎండార్ఫిన్‌లకు గొప్ప మూలం.

ముఖ్యంగా పచ్చిమిరపకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జీర్ణక్రియ సులభం చేస్తుంది గట్ హెల్దీగా ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో ఉండే బీటా కెరోటిన్ గుండె సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇదే కాకుండా, పచ్చి మిర్చీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తులు, నోరు, పెద్ద ప్రేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. అదే విధంగా క్రమం తప్పకుండా పచ్చి మిర్చి తీసుకోవడం వలన ఇది ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుందంట.

ఇక చాలా మంది ఎర్ర మిరపకాయల కారం పొడి ఉపయోగిస్తుంటారు. అయితే ఎర్ర మిరపకాయల పొడి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఇందులో ఉండే పొటాషియం, రక్తపోటును తగ్గిస్తుంది. ఎర్ర మిరపకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

ఇక ఈ రెండింటిలో ఏది మంచిది అంటే? రెండు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా వరకు పచ్చి మిర్చీని మనం కూరల్లో వేసుకొని తినేస్తుంటాం. కానీ ఎండు మిర్చీ మాత్రం ఎక్కువగా పొడి రూపంలో తీసుకుంటాం. అయితే చాలా వరకు మార్కెట్‌లో ఈ పొడి కొనుగోలు చేయడం వలన కల్తీ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, ఎర్ర మిరపపొడి కంటే పచ్చి మిర్చి బెస్ట్.