
శెనగపప్పు వడలకు కావాల్సిన పదార్ధాలు: రెండు కప్పుల శెనగపప్పు , బియ్యపు పిండి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి, బంగాళాదుంప, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అల్లం పేస్ట్, అల్లం, మూడు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, అర టేబుల్ స్పూన్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, వడలను కాల్చడానికి నూనెను తీసుకోవాలి.

శెనగపప్పు వడల తయారి విధానం : ముందుగా ఒక కప్పు శెనగపప్పును తీసుకుని నానబెట్టుకుని వీటిని తీసుకోవాలి. ఆ తరవాత వీటిని తీసుకుని మంచిగా రుబ్బుకోవాలి అయితే మెత్తగా పేస్ట్ లా చేయకండి ఆ తర్వాత దీనిలో ఐదు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పును కూడా దీనిలో తీసుకోవాలి.

శెనగపప్పు వడల స్టెప్ 2 : ఈ మిశ్రమంలో ఉడికబెట్టిన దుంపలు, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి చేతితోనే కలపాలి. అదే విధంగా టేస్టింగ్ సాల్ట్ కలిపితే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ఉడికించిన దుంపలు వేస్తె ఆ రుచి డబుల్ అవుతుంది. అలాగే, ఈ వడలు కూడా తినడానికి మంచిగా ఉంటాయి.

శెనగపప్పు వడల తయారి విధానం స్టెప్ 3 : శెనగపప్పులో అన్ని ఫ్లేవర్లు కూడా మంచిగా కలిసిపోతాయి. ఒక 10 నిముషాలు పక్కన పెట్టి మీరు తయారు చేసుకున్న మిశ్రమంతో వీటిని చిన్న చిన్న వడలుగా చేసుకుని ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు వీటిని మంచిగా కాల్చుకోవాలి.

ఈ వడలను కాల్చడం కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో కొంచం నూనె వేసుకోవాలి. ఇవి వేడయ్యాక వడలు కూడా దీనిలో వేయాలి. మీడియం మంట మీద వీటిని బాగా కాల్చుకోవాలి. ఇవి బంగారు కలర్లోకి మారిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు వీటిని పల్లీల చట్నీతో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి.