
కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు భారీ ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 10 గంటల వరకు తులం బంగారం ఏకంగా రూ. 2,070 తగ్గి, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,910 వద్ద ట్రేడవుతోంది. అటు వెండి కూడా బంగారం తరహాలోనే కేజీపై ఏకంగా రూ. 5,000 దిగొచ్చింది. దీంతో దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 2,45,000గా ఉంది.

ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే రూ. 1,45,910 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,750గా ఉంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 1,09,440 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతోంది. అటు విశాఖపట్నం, విజయవాడలోనూ బంగారం ధరలు ఇదే తరహాలో కొనసాగుతున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూసుకుంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పూణె, కేరళలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,45,910గా ఉండగా.. అదే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,750 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర రూ. 5 వేలు తగ్గి రూ. 2,45,000 వద్ద ట్రేడవుతుంటే.. కేరళలో మాత్రం కేజీ వెండి ధర రూ. 2,50,000గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ, చెన్నైలలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,46,060గా ఉండగా.. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,900 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,930గా ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,35,600 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చెన్నైలోనే బంగారం ధర అత్యధికంగా ఉంది.

అయితే ఈ బంగారం, వెండి ధరలు అనేవి అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం మేము చెప్పిన రేట్లు మంగళవారం ఉదయం 10 గంటలకు నమోదైనవి మాత్రమే.. కాబట్టి మీరు బంగారం కొనే ముందు మీ స్థానికంగా ఉన్న స్టోర్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొని వెళ్లడం మంచిది.