
కావాల్సిన పదార్థాలు : గోంగూర రెండు చిన్న కట్టలు, మరమరాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పోపు దినుసులు, చింత పండు రసం రెండు టేబుల్ స్పూనస్, ఉప్పు రుచికి సరిపడం, మిరియాలు నాలుగు నుంచి ఐదు, కరివేపాకు, పచ్చి మిర్చి, పసుపు చిటికెడు , ఇంగువ చిటికెడు, పల్లీలు.

తయారీ విధానం : ముందుగా గోంగూర ఆకులను తుంచి వాటిని శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టాలి. తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం నూనె వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఈ ఇది చల్లారబెట్టి, మిక్సీ జార్ తీసకొని, అందులో వేయిచిన గోంగూర ఆకులను, చిటికెడు పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో మెంతులు, ఆవాలు, మూడు ఎండు మిర్చీ, మిరియాలు వేసుకొని దోరగా వేయించి, మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మరమరా లను కూడా ఒక బౌల్‌లో వేసి నానబెట్టుకోవాలి.

ఇప్పుడు పులిహోర తయారీ చేయాలి : దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో నూనె పోసి, పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చి, ఎండు మిర్చీ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో గోంగూర పేస్ట్, చింత పండు రసం, మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి.

దీని తర్వాత ఇందులో మరమరాలు వేసి, మంచిగా కలుపుకోవాలి. ఇక చివరగా ఉప్పు పసుపు వేసి, మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, దీనిని పక్కన దించి పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మరమరాల గోంగూర పులిహోర రెడీ.