
Gold, Silver Rates: సంక్రాంతి పండగ పూట పసిడి ప్రియులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. దీంతో గురువారం బంగారం ధరలు దిగొచ్చాయి. ప్రస్తుతం గురువారం 10 గంటల సమయానికి మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 1,43,180గా కొనసాగుతుంది. ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,44,010గా ఉంది. అంటే కేవలం 4 గంటల్లోనే తులం బంగారంపై రూ.830 తగ్గింది.

అయితే బంగారం ధరలు తగ్గి కొనుగోళు దారులకు కాస్తా ఊరటనిస్తే.. వెండి మాత్రం సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతుంది. గురువారం 4 గంటల్లోనే ఏకంగా కేజీ వెండి ధర రూ.3000 పెరిగి ఆల్‌టైం హైకి చేరింది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.3,10,000 కు చేరుకుంది.

భారీ హెచ్చుతగ్గుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసుకుంటే హైరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1,43,180గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,250 వద్ద స్థిరపడింది. విజయవాడ, విశాఖపట్నంలో నూ ఇవే ధరలు ఉన్నాయి.

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూసుకుంటే.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,330గా కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,400 వద్ద స్థిరపడింది.

అలాగే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,490గా కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,900 వద్ద స్థిరపడింది. ఇక ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, కెరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1,43,180గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,250 వద్ద స్థిరపడింది.