
కొనుగోలుదారులకు బంగారం ధరలు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇయర్ ఎండింగ్లో ప్లేట్ మార్చాయి. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,25,080కి చేరింది.

ఇక ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,25,080గా ఉండగా, నిన్న ఈ ధర రూ.1,25,560గా ఉంది. అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు తులంపై రూ.480 దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే రూ.1,14,650 వద్ద ట్రేడవుతోంది. అంటే జనాలు ఆభరణాల కోసం కొనుగోలు చేసేది 22 క్యారెట్ల బంగారమే కాబట్టి.. ఇప్పుడు బంగారం వాళ్లకు రూ.1.15 లక్షలకే లభించనుంది.

ఇక హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడల్లో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలో తులం బంగారం రూ.1,25,080గా ఉండగా, ఢిల్లీలో మాత్రం రూ.1,25,230 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ మినహా కేరళ, బెంగళూరు, పూణె వంటి ప్రధాన నగరాల్లోనూ హైదరాబాద్ తరహా రేట్లే కొనసాగుతున్నాయి.

అయితే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి ప్రధాన కారణం అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలే అని చెబుతున్నారు విశ్లేషకులు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే.. ముఖ్యంగా బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెట్టడానికి జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. దీంతో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. దీని వల్ల డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

మొత్తంగా చూసుకుంటే అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు, డాలర్ బలపడటం కలిసి బంగారం ధరల తగ్గుదలకు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నా.. అది పూర్తిగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొనాలనుకునే వారు ఇప్పుడే బంగారం కొనడం మంచిది కావచ్చు. Note: పైన ఆర్టికల్‌లో పేర్కొన్న ధరలు నవంబర్ 21 ఉదయం 10 గంటలవి మాత్రమే.. ఇవి ఎప్పుడైనా మారవచ్చు. కాబట్టి కొనే ముందు తాజా ధరలు తెలుసుకోండి.