
కొనుగోలు దారులకు బంగారం ధరలు భారీ ఊరనిచ్చాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు రెండ్రోజులు వరుసగా తగ్గుతున్నాయి. తాజాగా బుధవారం కూడా బంగారం ధర రూ.600 వరకు తగ్గి ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ.1,49,570 వద్ద ట్రేడవుతుంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37, 100 వద్ద ట్రేడవుతుంది.

ఇక హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ.1,49,570 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37, 100 వద్ద ట్రేడవుతుంది. అటు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో సైతం హైదరాబాద్ తరహా రేట్లే కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,45,000 వద్ద ట్రేడవుతుంది.

అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై, పూణె, బెంగళూరు, కేరళలో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ.1,49,570 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37, 100 వద్ద ట్రేడవుతుంది. ఇక ఈ నగరాల్లో కేజీ వెండి ధర రూ.2,35,000 వద్ద ట్రేడువుతుంది.

కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం.. బంగారం ధరలు ఇతర నగరాలతో పోల్చుకుంటే వేరేగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,49,700గా ఉండగా 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,250గా ఉంది. ఇక చెన్నైలో తులం బంగారం ధర 1,49,570 గా ఉండగా కేజీ వెండి ధర రూ.1,45,000 వద్ద ట్రేడువుతుంది.

అమెరికన్ డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, అమెరికా ప్రభుత్వ బాండ్లకు రాబడులు పెరగడంతో బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారు తగ్గిపోయారు. దీంతో రెండ్రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ తగ్గుదల మన దేశంలోని బంగారం కొనే వారికి కాస్త రిలీఫ్‌ను కల్పించింది. అయితే ఈ ఆభరణాల ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనే ముందు స్థానికంగా ఉన్న షోరూమ్‌కు వెళ్లి ధరలు తెలుసుకోండి.