Gold Rates: ఒకేరోజు రూ.5 వేలు పతనం.. బంగారం, వెండి ధరలు భారీగా డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..

Updated on: Oct 15, 2026 | 9:57 AM

బంగారం, వెండి ధరలు పతనవుతున్నాయి. గత కొద్ది రోజులుగా పడిపోతుండగా.. గురువారం కూడా అదే బాటలో నడిచాయి. మరో ఐదు రోజుల్లో దసరా పండుగ రానుండటం, వచ్చే నెలలో దీపావళి పండుగ రానున్న క్రమంలో గోల్డ్ రేట్లు డౌన్ కావడం కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

1 / 5
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు తీపికబురు. పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తున్నారు. ఇలాంటివారికి ఊరట కలుగుతోంది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఈ వారం ప్రారంభం నుంచి కుప్పకూలుతూ వస్తోన్నాయి. ధరలు భారీగా పడిపోతూ ఉపశమనం కల్గిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల క్రమంలో ధరలు పడిపోవడం శుభవార్తగా చెప్పవచ్చు. అక్టోబర్ 15న లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,440 వద్ద కొనసాగుతోండగా.. గురువారం ఒక్కరోజే రూ.820 పడిపోయింది. 22 క్యారెట్ల రేటు రూ.1,35,150గా ట్రేడవుతోండగా.. నేడు రూ.750 క్రాష్ అయింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,590 వద్ద  ప్రస్తుతం కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.820 డౌన్ అయ్యాయి. 22 క్యారెట్ల ధర రూ.1,35,300గా ట్రేడవుతోండగా.. నేడు రూ.750 మేర పడిపోయింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,440 వద్ద  ఇవాళ కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,150గా ఉన్నాయి.

4 / 5
బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,440గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,150 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా భారీగా డౌన్ అయ్యాయి. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.30 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.35 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.5 వేలు పడిపోయింది.

5 / 5
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.30 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర ఇవాళ రూ.5 వేలు తగ్గింది. నిన్న రూ.2.45 లక్షలుగా ఉండగా.. నేడు రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us