Galijeru Kura: కిడ్నీలో రాళ్లు కరిగించి, లివర్‌ను క్లీన్ చేసే అద్భుతమైన కూర! గోంగూర కాంబినేషన్‌తో సూపర్ టేస్ట్

Updated on: Sep 16, 2026 | 11:39 AM

ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధ గుణాలున్న అడవి ఆకుకూరల్లో 'గలిజేరు' అత్యంత విశిష్టమైనది. శరీరంలోని ప్రతి కణాన్ని పునరుజ్జీవింపజేసే శక్తి దీనికి ఉండటం వల్లే దీనికి 'పునర్నవ' అనే పేరు వచ్చింది. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లను కరిగించడంలో, యూరినరీ ట్రాక్ట్ సమస్యలను నివారించడంలో మరియు కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రపరచడంలో గలిజేరు ఆకు సంజీవనిలా పనిచేస్తుంది.

1 / 6
సాధారణంగా వర్షాకాలం మొదలవగానే పల్లెటూళ్లలో, పొలాల గట్లపై ఈ ఆకు విరివిగా పెరుగుతుంది. అయితే ఈ ఆకు కాస్త చప్పగా, జిగురుగా ఉండటం వల్ల చాలామంది దీన్ని ఎక్కువగా తినలేరు. అలా కాకుండా ముప్పావు వంతు గలిజేరు ఆకుకి, పావు వంతు నాటు గోంగూరను కలిపి వండితే ఆకుకూర ఎక్కువ మొత్తంలో కడుపులోకి వెళ్లడమే కాకుండా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్టీ అండ్ హెల్దీ గలిజేరు కూర తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

2 / 6
కావలసిన పదార్థాలు: 3/4 కిలో - శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన గలిజేరు ఆకు, పావు కిలో - కడిగి సన్నగా తరిగిన  నాటు గోంగూర, 4 నుండి 5 టేబుల్ స్పూన్ల నూనె,  అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, గుప్పెడు - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 - సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , 5 నుండి 6 - సన్నని పచ్చిమిర్చి తరుగు, పసుపు పావు స్పూన్, అర స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు

3 / 6
తయారీ విధానం: గలిజేరు ఆకులను, గోంగూరను తుంచుకుని ఎక్కువ నీళ్లలో మట్టి లేకుండా శుభ్రంగా రెండు మూడు సార్లు జాడించి కడగాలి. నీరంతా వడకట్టిన తర్వాత ఇగురు కూర కాబట్టి రెండింటినీ చాలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.

4 / 6
స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీలో నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అందులోనే గుప్పెడు దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కమ్మటి సువాసన వచ్చేవరకు వేపాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కొద్దిగా ఉప్పు వేసి మీడియం మంటపై ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వేయించాలి.

5 / 6
 ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న గలిజేరు ఆకు, గోంగూర రెండింటినీ బాండీలో వేయాలి. గరిటెతో కలిపి మూతపెట్టి మీడియం మంటపై ఉడికించాలి. ఆకుకూరల్లోని సహజ నీటితోనే 10 నుండి 15 నిమిషాల్లో ఆకు మెత్తగా మగ్గిపోతుంది అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు.

6 / 6
ఆకు చక్కగా మగ్గి దగ్గరపడిన తర్వాత పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం పొడి వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి ఘాటు ఇప్పటికే ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా సరిపోతుంది. మరో రెండు నిమిషాలు చిన్న మంటపై నూనె తేలే వరకు మగ్గించి స్టవ్ కట్టేయాలి. అంతే, ఔషధ గుణాల గని అయిన కమ్మని గలిజేరు కూర సిద్ధం! గోంగూర పులుపు తోడవ్వడం వల్ల ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం తక్కువగా, ఈ ఆకుకూర ఎక్కువగా కలుపుకుని తింటే శరీరానికి, కిడ్నీల ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us