
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా.. అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. అన్ని రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం యువత సైతం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు అస్సలు లైట్‌గా తీసుకోకూడదు.

దీని వల్ల కడుపులో నొప్పి, గుండెల్లో మంట, నొప్పి, తల నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల చాలా మంది గుండెల్లో మంటతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ గ్యాస్ట్రిక్ సమస్యను మొదట్లోనే పరిష్కరించుకోవాలి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు పులుపు, ఆయిల్, కారం, తీపిని కూడా ఎక్కువగా తీసుకోకూడదు. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి.

గ్యాస్ట్రిక్ సమస్యతో బాధ పడితే అలోవెరా రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండెల్లో మంట, నొప్పి కంట్రోల్ అవుతాయి. వేడి పాలు తాగడం వల్ల కూడా రిలీఫ్ నెస్ పొందుతారు.

అలాగే జీలకర్ర, ధనియాల పొడిని నీటిలో కలుపుకుని తాగినా కూడా కడుపులో నొప్పి, వికారం, గుండెల్లో మంట వంటివి తగ్గుతాయి. కడుపులో యాసిడ్ కూడా తగ్గుతుంది.