చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదు..

Updated on: Sep 03, 2026 | 8:35 AM

చూడటానికి అచ్చం చెర్రీ పండులానే ఉంది.. ఎర్రగా.. నిగనిగలాడుతూ ఆకట్టుకుంటోంది. కానీ దాన్ని కోసి చూస్తే అసలు విషయం బయటపడుతోంది. చెర్రీ పేరుతో వాక్కాయను ఉడకబెట్టి, దానికి చెర్రీ తరహా రంగు, కోటింగ్ వేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బహిరంగ మార్కెట్లలో ఇలాంటి పండ్లు విక్రయిస్తున్నారనే ప్రచారంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది

1 / 5
సాధారణంగా చెర్రీ పండు ఎర్రటి రంగులో, చిన్న పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే రూపాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు వాక్కాయను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి.. చెర్రీని పోలిన రంగు, ఆకృతి వచ్చేలా తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాక్కాయను ఉడకబెట్టి, అనంతరం దానికి ఎరుపు రంగు లేదా కోటింగ్ వేసి.. చెర్రీ మాదిరిగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బయటకు చూసినప్పుడు అసలు చెర్రీకి, ఇలా తయారు చేసిన పండుకు తేడా గుర్తించడం కష్టంగా ఉంటోందని వినియోగదారులు అంటున్నారు...

2 / 5
చూపుకు అందం.. లోపల అసలు కథ. నకిలీ చెర్రీలను గుర్తించకుండా ఉండేందుకు వాటిని ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పండు మెరుస్తూ ఉండేలా కోటింగ్ వేయడం, సహజ చెర్రీ రంగును పోలిన రంగును ఉపయోగించడం ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్నారని సమాచారం. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. ఏ రంగు ఉపయోగించారు. అది ఆహారంలో వినియోగించేందుకు అనుమతించబడిందా. కోటింగ్‌లో ఏ పదార్థాలు ఉన్నాయి. అన్నది పరీక్షించాల్సి ఉంటుంది.

3 / 5
ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం. వాక్కాయతో తయారు చేసిన ఉత్పత్తి కావడం ఒక్కటే దాన్ని ప్రమాదకరంగా నిర్ధారించదు. కానీ ఆహారంలో ఉపయోగించే రంగులు, కోటింగ్స్ లేదా ఇతర పదార్థాలు అనుమతించబడినవేనా. నిర్ణీత పరిమితుల్లో ఉన్నాయా. అన్నదే అసలు ప్రశ్న. అనుమతిలేని రంగులు లేదా ఇతర పదార్థాలను ఉపయోగించి ఉంటే మాత్రం అది ఆహార భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశంగా మారుతుంది..అందుకే కేవలం వీడియోలు లేదా ఫొటోలు చూసి “ఇవి నకిలీ చెర్రీలు అని తేల్చడం కంటే.. మార్కెట్ నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తేనే అసలు నిజం బయటపడుతుంది.

4 / 5
వినియోగదారులు జాగ్రత్త.. మార్కెట్లో చెర్రీలు కొనుగోలు చేసేటప్పుడు అసహజంగా ఒకే రంగులో ఉండటం, విపరీతంగా మెరుస్తూ కనిపించడం, చేతికి రంగు అంటడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. పండు నాణ్యతపై అనుమానం వస్తే రుచి చూసి పరీక్షించకూడదు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడం మంచిది..

5 / 5
బహిరంగ మార్కెట్లలో చెర్రీ పేరుతో వాక్కాయను ప్రాసెస్ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు నిజమైతే.. ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి..అనుమానాస్పద చెర్రీల నమూనాలను సేకరించి.. వాటిని ల్యాబ్‌కు పంపితేనే అవి నిజమైన చెర్రీలా? వాక్కాయతో తయారు చేసినవా. ఏ రంగులు, కోటింగ్స్ ఉపయోగించారు. అవి ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా. అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లభిస్తుంది. చూడటానికి చెర్రీలా ఉందని కొనేస్తే సరిపోదు.. మన ప్లేట్‌లోకి వెళ్లేది ఏంటో తెలుసుకోవాల్సిందే. బయట ఎర్రటి రంగు కనిపించినంత మాత్రాన అది అసలు చెర్రీ అయి ఉండకపోవచ్చనే అనుమానాలు ఇప్పుడు వినియోగదారులను ఆలోచింపజేస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us