2 / 5
ముందుగా చీమలు నిద్రపోతాయో లేదో తెలుసుకుందాం.. గార్డియన్ నివేదిక ప్రకారం, చీమలు నిద్రపోతాయి. కానీ మనం అర్థం చేసుకున్న రీతిలో అస్సలు కాదు.1983లో చీమలపై చేసిన పరిశోధన ప్రకారం, అవి 24 గంటలలో 12-12 గంటల వ్యవధిలో, అది కూడా 8-8 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. వాటికి నిద్ర కంటే కునుకులే ఎక్కువ ఇష్టం. అందుకే ఎక్కువగా చీమలు కదులుతూనే కనిపిస్తాయి.