స్క్రబ్ ఉపయోగించడం వల్ల మృతకణాలతో పాటు అదనపు నూనె, బ్యాక్టీరియా, ధూళి కూడా తొలగిపోతాయి. ఇది చర్మాన్ని తాజాగా, అందంగా కనిపించేలా చేస్తుంది. అలాగని ఎక్కువగా స్క్రబ్ ఉపయోగిస్తే, చర్మం సున్నితత్వం దెబ్బతింటుంది. దీంతో చర్మంపై దద్దుర్లు, ఎరుపు, మొటిమల సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి స్క్రబ్స్ ఎలా వాడాలి అనే విషయంలో కొంత అవగాహన ఉండాలి.