Egg: తెల్లసొన vs పచ్చసొన.. గుడ్డులో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..

Updated on: Jun 08, 2026 | 12:03 PM

తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో గుడ్డుకు సాటిలేదు. అందుకే దీనిని ప్రకృతి ప్రసాదించిన మల్టీవిటమిన్ అని పిలుస్తారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. గుడ్డులో విటమిన్ డి, బి12, సెలీనియం, అయోడిన్, కోలిన్‌తో సహా 13కు పైగా అత్యవసర విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అయితే గుడ్డులోని తెల్లసొన, పచ్చసొనల మధ్య పోషకాల పంపిణీలో చాలా వ్యత్యాసం ఉంది.

1 / 5
గుడ్డు మొత్తం బరువులో తెల్లసొన సుమారు 60శాతం ఉంటుంది. ఇందులో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా ఉండి, అత్యంత నాణ్యమైన ప్యూర్ ప్రోటీన్ లభిస్తుంది. గుడ్డులో ఉండే మొత్తం ప్రోటీన్‌లో సగానికి పైగా ఈ తెల్లసొనలోనే ఉంటుంది. కండరాల బలానికి, బరువు తగ్గడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. అయితే తెల్లసొనలో కొవ్వు అస్సలు ఉండదు కాబట్టి, కొవ్వులో కరిగే విటమిన్లు ఇందులో పూర్తిగా శూన్యం.

2 / 5
మరోవైపు గుడ్డు బరువులో పచ్చసొన సుమారు 30 నుంచి 35శాతం ఉంటుంది. బరువు పరంగా చూస్తే తెల్లసొనలో ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పటికీ.. గ్రామ్ టు గ్రామ్ లెక్కేస్తే తెల్లసొన (100 గ్రాములకు 10.8 గ్రా) కంటే పచ్చసొనలోనే (100 గ్రాములకు 16.4 గ్రా) ప్రోటీన్ సాంద్రత చాలా ఎక్కువ. గుడ్డుకు అసలైన పోషక బలాన్ని, రుచిని ఇచ్చేది ముమ్మాటికీ ఈ పచ్చసొన భాగమేనని సైన్స్ చెబుతోంది.

3 / 5
విటమిన్లు, ఖనిజాల విషయానికి వస్తే పచ్చసొన ఒక పవర్‌హౌస్ లాంటిది. ఇందులో విటమిన్ బి6, బి12, ఫోలేట్, జింక్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదడు అభివృద్ధికి, కాలేయ పనితీరుకు అవసరమైన కోలిన్ అనే పోషకం ఇందులో చాలా ఎక్కువ. అంతేకాకుండా కొవ్వులో కరిగే విటమిన్లు అయిన A, D, E, K లతో పాటు హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పచ్చసొనలోనే లభిస్తాయి.

4 / 5
ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఎవరికి ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే.. కేవలం మజిల్ గెయిన్, వెయిట్ లాస్ కోరుకునే అథ్లెట్లు మరియు బాడీబిల్డర్లకు తెల్లసొన అద్భుతమైన ఛాయిస్. ఇది కొవ్వు, కొలెస్ట్రాల్ లేకుండా ప్యూర్ ప్రోటీన్‌ను అందిస్తుంది. అదే సమయంలో మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగుపడటానికి మరియు హార్మోన్ల సమతుల్యతకు పచ్చసొనలోని పోషకాలు, లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటిఆక్సిడెంట్లు ఎంతో అవసరం.

5 / 5
చివరగా గుండె జబ్బులు ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు పచ్చసొనను వైద్యుల సలహాతో పరిమితంగా తీసుకోవడం మంచిది. సాధారణ వ్యక్తులు, పిల్లలు మాత్రం శరీరానికి పూర్తి స్థాయి పోషకాలు, విటమిన్లు అందాలంటే గుడ్డును మొత్తంగా తినడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీ శారీరక అవసరాలకు తగినట్లుగా గుడ్డును మీ డైట్‌లో భాగం చేసుకోండి.

Follow Us