
చాలా మందికి వాతావరణం చల్ల బడగానే ఒంటి నొప్పులు వస్తాయి. వాటితో పాటు మోకాళ్ళు, చేతులు, కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. ఇలాంటి వాళ్ళు మందులు వాడకుండా ఈ చిట్కాలు పాటిస్తే చాలు. మీకు ఒక్క రోజులోనే ఫలితం కనిపిస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలి? దీనికి కావాల్సిన పదార్దాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

దీని కోసం మీ ఇంట్లో ఉండే వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక్క గ్లాస్ తాగినా చాలు. అల్లం, మిరియాల పొడిని పాలతో తీసుకుంటే మంచిది. అల్లం, మిరియాల ఘాటు కలయిక వలన ఈ పాలు మరింత టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గ్లాస్ పాలు, ఒక చిన్న అల్లం ముక్క, పావు టీ స్పూన్ మిరియాల పొడి , పసుపు , తేనెను తీసుకోవాలి

ముందుగా చిన్న అల్లం ముక్కను తీసుకుని రోటిలో దీనిని మెత్తగా దంచి గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పాలు పోసి సన్నని మంటపై దీనిని బాగా మరిగించాలి. ఈ పాలు వేడి అయినా తర్వాత దీనిలో కలిసిపోయే వరకు ఉంచాలి. అలాగే పొయ్యి మీదే 5 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించాలి.

ఇక చివర్లో మిరియాల పొడి, దానితో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. మొత్తం కలిపిన తర్వాత నాలుగు నిముషాలు మీడియం మంటపై వీటిని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా బెల్లం కూడా కలుపితే తాగితే మంచి రుచి వస్తుంది. అంతే కాదు మీరు దీనిలో తేనే కూడా వేసుకోవచ్చు.

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)