రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..? బరువు తగ్గాలనుకునే వారు తప్పక తెలుసుకోండి..

Updated on: Jul 13, 2026 | 9:27 PM

రోజంతా బిజీగా గడిపాక రాత్రి పూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని చాలామంది కోరుకుంటారు. భారీ డిన్నర్లు లేదా ఫ్రైడ్ స్నాక్స్ తింటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో కొన్ని రకాల పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది బొప్పాయి. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు బొప్పాయి తినడం వల్ల కేవలం రిఫ్రెషింగ్‌గానే కాకుండా అదనపు బరువు తగ్గడానికి, ప్రశాంతమైన నిద్రకు కూడా ఇది సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
రోగనిరోధక శక్తి పెరుగుదల: 2022 నాటి ఒక పరిశోధనా పత్రం ప్రకారం.. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, సీజనల్ వ్యాధుల నుండి కాపాడుతుంది. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖంపై ముడతలను తగ్గించి, చర్మానికి సహజమైన గ్లో ఇస్తాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ శరీరంలో వచ్చే వాపులను, కీళ్లనొప్పుల లక్షణాలను తగ్గిస్తాయి.

2 / 5
రాత్రి పూట బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ప్రొటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది. రాత్రి భారీ డిన్నర్ చేసిన వారికి లేదా కడుపులో అసౌకర్యంగా ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. బొప్పాయిలో ఫైబర్ గుణాలు ఎక్కువ. ఇది మరుసటి రోజు ఉదయం మోషన్ ఫ్రీ అయ్యేలా చేస్తుంది. యుఎస్డీఏ ప్రకారం.. 152 గ్రాముల చిన్న బొప్పాయిలో కేవలం 68 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో నీటి శాతం (88శాతం), ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. రాత్రి పూట స్వీట్ తినాలనిపించే వారికి ఇది బెస్ట్ లో క్యాలరీ ఆప్షన్.

3 / 5
రాత్రి పూట బొప్పాయి తినే సరైన విధానం: రాత్రి భోజనం చేసిన 30 నుండి 60 నిమిషాల తర్వాత ఒక చిన్న కప్పు ముక్కలను తినాలి. భోజనం చేసిన వెంటనే తినకూడదు. బొప్పాయి ముక్కలపై అదనంగా చక్కెర లేదా క్రీమ్ వంటివి అస్సలు జోడించవద్దు. మరింత పోషకాల కోసం వీటితో పాటు కొన్ని నానబెట్టిన బాదం లేదా వాల్‌నట్స్‌ తీసుకోవచ్చు.

4 / 5
చేయకూడని తప్పులు - అపోహలు:  ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. పండ్లు, పాలు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కష్టమవుతుంది. కాబట్టి బొప్పాయి తిన్నాక పాలు తాగడం ఆపేయండి. సెన్సిటివ్ కడుపు ఉన్నవారు రాత్రి పూట అతిగా తింటే కడుపు ఉబ్బరం రావచ్చు కాబట్టి ఒక కప్పుకే పరిమితం అవ్వండి. రాత్రి బొప్పాయి తింటే జలుబు చేస్తుంది, కఫం పెరుగుతుందని అనుకుంటారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా ఇందులోని విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది.

5 / 5
ఎవరు తినకూడదు?: తీవ్రమైన ఎసిడిటీ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి ఆలస్యంగా బొప్పాయి తినకపోవడమే మంచిది. IBS ఉన్నవారికి ఇందులోని ఫైబర్ వల్ల గ్యాస్ లేదా విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. బొప్పాయి అలెర్జీ ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. ఆయుర్వేదంలో కూడా బొప్పాయిని పిత్త దోషాన్ని సమతుల్యం చేసే అద్భుత ఔషధంగా పేర్కొన్నారు. రాత్రి పూట అరటిపండు లేదా యాపిల్ కంటే బొప్పాయి తినడం వల్ల కడుపు తేలికగా ఉండి, జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. సరైన నియమాలు పాటిస్తూ దీనిని మీ డైట్‌లో చేర్చుకుంటే బరువు తగ్గడం చాలా సులువవుతుంది.

Follow Us