Chicken: చికెన్ లవర్స్ జాగ్రత్త.. రోజూ తింటే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే..!

Updated on: Oct 15, 2026 | 2:21 PM

రోజూ చికెన్ తినే అలవాటు మీకుందా? చికెన్‌లో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభించినప్పటికీ, ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా చికెన్‌ను ఏ పద్ధతిలో వండుతున్నారు? ఎంత మోతాదులో తీసుకుంటున్నారు అనే అంశాలు కీలకంగా మారుతాయి. రోజూ చికెన్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం!

1 / 5
చికెన్ అంటే ఇష్టపడని నాన్‌వెజ్ ప్రియులు చాలా తక్కువ మందే ఉంటారు. చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, గ్రిల్డ్ చికెన్.. ఇలా రకరకాల వంటకాలను చాలామంది ఇష్టంగా తింటారు. చికెన్‌లో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. అయితే, ప్రతిరోజూ చికెన్ తింటే ఆరోగ్యానికి మంచి కంటే చెడే ఎక్కువ. ముఖ్యంగా చికెన్‌ను అధిక నూనెతో వేయించి తినడం, ఆహారంలో ఇతర పోషక పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కొన్ని సమస్యలకు దారితీసే అవకాశముంది.

2 / 5
చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం: చికెన్‌లోని కొవ్వు పరిమాణం అది ఏ భాగం నుంచి తీసుకున్నారు? చర్మంతో తింటున్నారా? ఎలా వండుతున్నారు? అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. చికెన్‌ను అధిక నూనెతో వేయించడం, వెన్న లేదా క్రీమ్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆహారంలో కేలరీలు, కొవ్వు పెరుగుతాయి. ఇలా రోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పెరిగి, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే ఉడికించిన, గ్రిల్ చేసిన లేదా తక్కువ నూనెతో వండిన చికెన్‌ను ఎంచుకోవడం మంచిది.

3 / 5
బరువు పెరిగే ప్రమాదం: చికెన్ ఒక్కటే బరువు పెరగడానికి కారణం కాదు. అయితే చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, డీప్ ఫ్రైడ్ చికెన్ వంటి వంటకాల్లో నూనె, వెన్న, క్రీమ్ ఎక్కువగా ఉంటే కేలరీలు గణనీయంగా పెరుగుతాయి. శరీరం ఖర్చు చేసే శక్తి కంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటూ ఉంటే కాలక్రమంలో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బరువు పెరిగితే డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ వంటి అనారోగ్య సమస్యలు ఫ్రీగా వచ్చేస్తాయని అందరికీ తెలిసిందే.

4 / 5
ఆహార సంబంధిత ఇన్ఫెక్షన్లు: చికెన్‌ను సరిగ్గా నిల్వ చేయకపోవడం, పూర్తిగా ఉడికించకపోవడం వల్ల సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా ద్వారా ఆహార సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పచ్చి చికెన్‌ను తాకిన కత్తులు, కటింగ్ బోర్డులు, పాత్రలను శుభ్రం చేయకుండా ఇతర ఆహార పదార్థాలకు ఉపయోగించినా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశముంది. చికెన్‌ను పూర్తిగా ఉడికించి తినడం, పచ్చి మాంసాన్ని ఇతర ఆహారాలకు దూరంగా ఉంచడం ముఖ్యం.

5 / 5
పోషకాల సమతుల్యత లోపం: ప్రతిరోజూ చికెన్ తినడం వల్లనే పోషకాల లోపం వస్తుందని చెప్పలేం. కానీ ప్రోటీన్ కోసం చికెన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతూ కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు వంటి ఇతర ఆహారాలను నిర్లక్ష్యం చేస్తే శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు తగినంతగా అందకపోవచ్చు. అందుకే రోజూ చికెన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఆహారంలో వివిధ రకాల పోషక పదార్థాలకు చోటు కల్పించాలి. పోషకాల సమతుల్యత ఏర్పడితే అనారోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..

Loading...
Unable to load recommendations.
Follow Us