ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా.. నాన్ వెజ్ తినడం ఇష్టం లేదా.. మీ కోసమే ఈ హెల్తీ ఫుడ్..

మన శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు పోషకాలు అత్యంత ముఖ్యమైనవి. ఎప్పుడైతే పోషకాలు సక్రమంగా అందుతాయో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనలో చాలా మంది ఏదైనా అరోగ్య సమస్యకు గురవగానే బలం కోసం పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ప్రారంభిస్తారు.......

|

Updated on: Jan 15, 2023 | 7:30 AM

పోషకాలు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, శనగలు, వేరు శనగలు తీసుకోవాలని ఆరోగ్య, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో విరివిగా లభించే శనగల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.  శనగల్లో నాటు శనగలు, కాబూలీ శనగలు, ఆకుపచ్చ రంగులో ఉండే శనగలు కూడా ఉంటాయి.

1 / 5
శనగలతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మాంసంలో ఉన్న పోషకాలన్నీ శనగలలో కూడా పుష్కలంగా ఉంటాయని, అందుకే వీటిని పేదోడి బాదం అని కూడా అంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక  కొన్ని శనగలను నానబెట్టి మొలకలు వచ్చాక పచ్చివి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరం. శనగల చాట్‌ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

2 / 5
శనగల్లో క్యాల్షియం, విటమిన్‌ ఏ, బీ, సీ, ఈ, కే, ఫాలేట్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సెలీనియం, ఫైబర్‌, ఐరన్‌ వంటి అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయి శనగలు. క్యాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారమని అంటున్నారు నిపుణులు.

3 / 5
శనగలను ఆహారంలో తీసుకోవడం వలన ఐరన్‌, ప్రోటీన్‌, మినరల్స్‌ శరీరానికి శక్తిని అందిస్తాయి. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి శరీరం దరికి చేరవు. శనగల్లో పీచు సమృద్ధిగా ఉండడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మలబద్ధకం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

4 / 5
శనగలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తాయి. దీనివల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉండడమే కాక అధిక బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. శనగలు శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేసి ఆస్టియోపోరోసిస్‌, అనీమియాతో బాధపడుతున్నవారికి పౌష్టికాహారంగా ఉపయోగపడతాయి.

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు