
ఉడికించిన కోడి గుడ్డు తినడానికి ఎంత రుచిగా ఉంటుందో, వాని పైన ఉన్న పెంకులు తియ్యడం కొన్ని సార్లు అంత కష్టంగా కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే కొన్ని సార్లు లోపలి తెల్ల సొన, నీలం కూడా బయటకు వస్తుంటుంది. దీంతో చాలా మంది వాటిని తియ్యడానికి ఇబ్బంది పడతారు. కానీ ఈ విధంగా గుడ్డు పెంకులు తీస్తే చాలా సులభంగా వచ్చేస్తుందంట.

దీని కోసం ముందుగా కోడి గుడ్లను తీసుకొని, వాటిని పాత్రలో వేసి, గుడ్లు మునిగే వరకు నీరు పోయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అధిక మంటపై ఉడికించాలంట. దాదాపు 12 నిమిషాల వరకు కోడి గుడ్లను ఉడికించడం వలన అవి మంచిగా ఉడుకుతాయంట.

కోడి గుడ్లు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వెంటనే వేడి నీటి నుంచి చల్లటి నీటిలో వేయాలి. దీని వలన వాటిని చాలా సులభంగా పట్టుకొని తీయవచ్చును. పెంకులు తియ్యడానికి, చిన్న స్పూన్ తీసుకొని, పగుల్లు వచ్చేలా కొట్టాలి. తర్వాత వాటిని చల్లటి నీటిలో వేయాలి. తర్వాత ఐదు నిమిషాల పాటు చల్లటి నీటిలోనే ఉంచాలి.

ఇప్పుడు చల్లటి నీటి నుంచి ఉడికించిన గుడ్డు తీసి గ్లాస్‌లో వేయాలి. అందులో ఎగ్ మునిగేంత వరకు నీరు పోసి, గ్లాస్ మూతి వద్ద చేతిని అడ్డం పెట్టి చిన్నగా అటు ఇటు ఊపండి. దనీ వలన పగుళ్లు ఏర్పడతాయి. ఇది కోడి గుడ్డు పెంకును తెల్ల సొనను వేరు చేయడానికి సహాయపడతుుంది.

ఇప్పుడు గ్లాస్ నుంచి గుడ్డు తీసి , పెంకులను చేతితో ఒలవండి. ఇలా చేయడం వలన మీరు శ్రమపడకుండానే, కోడి గుడ్డు పెంకులు చాలా సులభంగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే కొంత మంది కోడి గుడ్డు కొట్టడం చేస్తుంటారు. దీని వలన లోపలి ఎల్లో కలర్ తెల్ల సొన రెండూ కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాట్టి పైన చెప్పిన చిట్కా ప్రకారం చేయడం వలన కోడి గుడ్డు పెంకులు చాలా సులభంగా వచ్చేస్తాయంట.