
ఆదివారం వస్తే చాలు మటన్ చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, దీనిని కొనుగోలు చేసే సమయంలో కొందరు టెన్షన్ పడుతుంటారు. ఇంకొందరు వ్యాపారులు ఫ్రెష్ మటన్ కాకుండా, నిల్వ ఉన్న మటన్ కట్ చేసిన కొట్టుల వద్ద, సంతల్లో విక్రయిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే తాజా కట్ ఎలా గుర్తించాలో ఇక్కడ చూద్దాం..

మటన్ ఫ్రెష్ గా ఉందా తెలుసుకోవడానికి.. ఈ రోజు కట్ చేసింది అయితే ఎరుపు రంగులో ఉంటుంది అలా కాకుండా ఈ రంగు చాలా పాలిపోయినట్టు కనిపిస్తే అది నిల్వ ఉన్న మాంసం కొన్ని సార్లు మరి ఎర్రగా కనిపించినా అది ముదురు మాంసం అలాంటిది తీసుకుంటే ఉడకడానికి సమయం పడుతుంది సహజంగా కనిపించే ఈ ఎరుపు రంగు తాజా మటన్‌గా అని గుర్తించండి

మాంసాన్ని పట్టుకుంటే అప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఇంకా తాజా మటన్‌ను అయితే టచ్ చేయగానే గట్టిగా, బలంగా ఉంటుంది. అలా కాకుండా ముక్క మెత్తగా లేదా జారితే నిల్వ ఉంచిన మాంసం అని అర్ధం. ఇలాంటి దానిని అస్సలు కొనొద్దు ఆలాగే తినొద్దు కూడా.. ఇంకా ఉంచితే పాడవుతుందని అర్ధం. తాజా మటన్ అయితే తేమగా ఉంటుంది

ఇంకా వాసనతో కూడా ఫ్రెష్ మటన్ లేక కాదో అన్నది ఈజీగా తెలిసిపోతోంది ఇంకా తాజా మటన్‌కు వాసన ఎక్కువగా ఉండదు. సహజమైన మాంసం మాత్రమే కొద్దిగా వాసన వస్తుంది ఇంకా ఇది పుల్లటి వాసన వస్తే మంచిది కాదని అర్ధం. నాన్ వెజ్ మార్కెట్‌లో కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసి దీనికి కొనాలి ఆన్లైన్ లోది కూడా మంచిదని నమ్మకండి

మటన్ కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం లైసెన్స్ ఉన్న వాటి వద్దే కొనుగోలు చేయండి. రోడ్డు పక్కన ప్రదేశాల్లో అమ్మే మటన్‌ను అస్సలు తీసుకోకండి. ఇంకా మాంసం పై రక్తం ఉన్నా కూడా అది మంచిది కాదు ఇంకా అది గట్టిగా ఉంటే అది నిల్వ చేసినది అని గమనించాలి. ఇవి పాటిస్తే ఈ రోజే కట్ చేసిన మీట్ ను ఇలా ఈజీగా గుర్తించవచ్చు.