
అయితే కొంత మందికి కొన్ని సార్లు తినాలనిపిస్తుంది. అయితే అప్పుడు ఆ క్షణాలకి ఇంటిలో గ్యాస్ అయిపోవడం లేదా స్టవ్ ఆన్ చేసి చేయాలనే చిరాకుతో ఆసక్తి లేకపోవడం జరుగుతుంది. అయితే పొయ్యి ముట్టించే పని లేకుండానే చాలా సులభంగా ఈ స్వీట్ తయారు చేయవచ్చునంట. కాగా, ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం.

పొయ్యి లేకుండా స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల విషయాల్లోకి వెళ్లితే.. చక్కెర లేదా బెల్లం, పాలు కప్పు, యాలకుల పొడి, నెయ్యి, జీడిపప్పు, బాదం, శనగపప్పు. కాగా, గ్యాస్ లేకుండా స్వీట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

దీనికి కోసం ముందుగా చక్కెరను తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చక్కెర, యాలకుల పొడి అన్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అది చాలా మెత్తని పిండి ముద్దలా ఉండాలి. అప్పుడే స్వీట్ పర్ఫెక్ట్‌గా అంతే కాకుండా చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఆ తర్వాత అందులోనే పుట్నాల పప్పు పిండి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో నెయ్యి, పాలు పోసి మంచిగా కలుపుతూ ఉండాలి.

ఆ తర్వాత పిండి కాస్త తేమగా ముద్దలా అయిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీజార్ తీసుకోని అందులో జీడిపప్పులు బాదం వేసి మరోసారి మంచిగా మెత్తని పిండిలా తయారు చేసుకోవాలి. తర్వాత పాలు పోస్తూ మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో కలపాలి.

ఇప్పుడు ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి, మనం పేస్టులా తయారు చేసుకున్న పిండి ముద్దను గట్టిగా ఒత్తుతూ ప్లేట్ మొత్తం పేర్చుకోవాలి. తర్వాత అది గట్టి పడేలా చేయాలి. ఒక గంట తర్వాత అది పూర్తిగా గట్టి పడుతుంది. అప్పుడు దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తిటే, తియ్య తియ్యని స్వీట్ రెడీ.