Desi Ghee: వెన్నతో పనిలేదు.. జస్ట్‌ మీగడతోనే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఇలా తయారు చేయండి!

Updated on: Aug 25, 2026 | 6:15 PM

సాధారణంగా మనం నెయ్యి తయారు చేయాలంటే ఏం చేస్తాం.. పాలను మరగబెట్టి వాటి నుంచి మీగడ తీసి.. తర్వాత దాన్ని వెన్నలా మార్చి ఆ వెన్న నుంచి నెయ్యిని తయారు చేస్తాం. ఇది అందరికి తెలిసిన పద్దతి. కానీ ఈ ప్రాసెస్ అంతా లేకుండా నేరుగా మీగడ నుంచి నెయ్యిని తయారు చేయొచ్చంటే మీరు నమ్ముతారా? అవును ఓ సింపుల్ చిట్కాను పాటిస్తే.. మీరు వెన్నతో కాకుండా నేరుగా మీగడ నుంచే నెయ్యిని తయారు చేయవచ్చు. అంతేకాదు ఈ ప్రక్రియలో మీరు పనీర్ కూడా తయారు చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం.

1 / 5
మీరు వెన్న లేకుండా నెయ్యి తయారు చేయడం ఎలాగో ఇక్కడ స్టెప్‌బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా మీరు వారం పాటు పాల నుంచి మీగడను తీసి పెట్టుకోవాలి. మీరు దాన్ని ఫ్రిజ్‌లో కనుక ఉంచినట్లయితే నెయ్యి తయారీకి రెండు మూడు గంటల ముందే దాన్ని బయట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. తర్వాత మీగడను ఓ మందపాటి కడాయిలో వేసి, కొద్దిగా నీళ్లు కలపండి. అడుగు పట్టకుండా కలుపుతూ మంటపై వేడి చేయండి. మీగడ పూర్తిగా కరిగి పాలులా మారాక స్టవ్ ఆపేయండి.

2 / 5
ఇప్పుడు ఆ కరిగిన మీగడ మధ్యలో నీటితో నిండిన ఒక గ్లాసును నిలబెట్టి, ఆ కడాయిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి. మార్నింగ్ అయ్యే సరికి ఆ మీగడ గట్టిగా పేరుకుంటుంది. అప్పుడు మధ్యలో ఉన్న గ్లాసును తీసి అక్కడ ఏర్పడే గుంటలో చల్లటి నీటిని పోయండి. తర్వాత ఆ నీటిని మరో పాత్రలో ఒంపేయండి. ఇలా ఒకటి రెండు సార్లు చేస్తే మీగడలోని అదనపు నీరు మొత్తం పోతుంది. దాన్ని కాసేపు అలానే పక్కన పెట్టండి.

3 / 5
కొద్ది సేపటి తర్వాత నీరు మొత్తం పోయిన మీగడ గట్టిపడుతుంది. దాన్ని మళ్లీ కడాయిలో వేసి స్టవ్‌ లో ఫ్లైమ్‌లో పెట్టి దాన్ని మళ్లీ వేడి చేయండి.  మీగడ కరిగి లేత పసుపు రంగులోకి రాగానే స్టవ్ ఆపేయండి. తర్వాత దాన్ని ఒక కాటన్ గుడ్డలో పోసి వడకట్టండి. ఇప్పడు గుడ్డలో మిగిలిన గట్టి మీగడనుపై ఏదైనా బరువు పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయండి. కాసేపటి తర్వాత అది తాజా పనీర్‌గా తయారవుతుంది. దీన్ని మీరు వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.

4 / 5
అయితే మీరు వడకట్టిన ద్రవాన్ని మళ్లీ ఒక కడాయిలో పోసి తక్కవ మంటపై మరోసారి మరిగించండి. అది మరిగేటప్పుడు మెల్లగా కలుపుతూ ఉండండి.. అంతే కొద్దిసేపటికి మీ కడాయిలో స్వచ్ఛమైన నెయ్యి పైకి తేలుతుంది. అప్పుడు మీరు స్టవ్ ఆపేసి అది చల్లారిన తర్వాత వడకట్టి ఓ డబ్బాలో స్టోర్ చేసుకోండి. అంతే వెన్న లేకుండానే నెయ్యి రెడీ అయిపోతుంది.

5 / 5
అంతేకాదు అడుగున మిగిలిన మీగడ గోదుమ రంగు మాడలో కొంచెం పంచదార పొడి కలిపి మీరు దాన్ని  చిన్న చిన్న స్వీట్ పేడాలుగా కూడా తయరు చేసుకోవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే మీరు మీగడను ఎక్కువసేపు చిలికే పని లేకుండానే ఒకేసారి స్వచ్ఛమైన నెయ్యి, పన్నీర్ రెండింటినీ తయారు చేసుకోవచ్చు.Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి వీటిని Tv9 దృవీకరించడం లేదు..

Loading...
Unable to load recommendations.
Follow Us