దుమ్ము, ధూళిని ఊపుతూ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు తుమ్ములు, దగ్గులు మొదలయ్యాయా? కొద్దిపాటి డస్ట్‌కే తుమ్ములు ముంచెత్తుతున్నాయా?ఇది డస్ట్ అలర్జీ కావచ్చు. డస్ట్ అలర్జీ వల్ల చర్మంపై దద్దుర్లు, దురద కూడా రావచ్చు. ఇంట్లోని దుమ్ము మాత్రమే కాదు, వీధిలోంచి వెలువడే వాహనాల పొగలు, దుమ్ము, ఇసుక వల్ల కూడా తుమ్ములు, దగ్గులు వస్తాంటాయి. ఈ రోజుల్లో చాలా మంది ఈ డస్ట్ అలర్జీ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అలర్జీ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి కేవలం దుమ్మును నివారించడం వలన మాత్రమే ఈ సమస్య పరిష్కారం కాదు. వైద్యుల సలహా కూడా తీసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలి.