
జీర్ణ వ్యవస్థకు పునరుజ్జీవం: మెంతుల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 11 రోజుల పాటు క్రమం తప్పకుండా మెంతి నీటిని తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపును తేలికగా ఉంచుతుంది.

చక్కెర స్థాయిల నియంత్రణ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి నీరు ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేసి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. 11 రోజుల చికిత్స తర్వాత చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటాన్ని గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే డయాబెటిస్ మందులు వాడుతున్న వారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని ప్రారంభించాలి.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మెంతి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. 11 రోజుల నిరంతర వాడకం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

శరీర వేడి, వాపుల నుండి రిలీఫ్: శరీరంలో అధిక వేడితో బాధపడేవారికి మెంతి నీరు చలవ చేస్తుంది. ఇందులోని సహజ శోథ నిరోధక లక్షణాలు కీళ్ల నొప్పులు, మంట మరియు శరీర వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

సహజ శక్తి - మెరిసే చర్మం: మెంతి నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు అలసటను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం ద్వారా చర్మం సహజంగా మెరుస్తుంది.

జాగ్రత్తలు తప్పనిసరి: మెంతి నీరు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా ప్రత్యేక వైద్య చికిత్స పొందుతున్న వారు వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే దీనిని క్రమం తప్పకుండా తాగడం మంచిది.