ఖాళీ నేల్ పాలిష్ బాటిళ్లను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ఐడియాలతో మీ ఇంటిని అలంకరించండి!

Updated on: Apr 08, 2026 | 1:05 PM

నేల్ పాలిష్ బాటిళ్లను రీసైకిల్ చేయడం ద్వారా స్టైలిష్ హోమ్ డెకర్ వస్తువులను తయారు చేయవచ్చని తెలుసా..? కానీ, ఇది నిజమేనండోయ్.. మనం తరచుగా వాడే నేల్ పాలిష్ అయిపోగానే ఆ బాటిల్స్‌ను పనికిరావని పారేస్తుంటాం. కానీ వాటిని సృజనాత్మకంగా ఉపయోగిస్తే అద్భుతమైన అలంకరణ వస్తువులుగా మార్చవచ్చని తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఖాళీ అయిన నేల్ పాలిష్ బాటిళ్లను (Empty Nail Paint Bottles) పారేయకుండా, వాటితో ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి కొన్ని ఈ సింపుల్ డెకర్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి.

1 / 6
ముందుగా ఏం చేయాలి?: నేల్ పాలిష్ బాటిల్‌ను శుభ్రం చేయడం ముఖ్యం. బాటిల్‌లో కొంచెం రిమూవర్ పోసి బాగా ఊపితే లోపల ఉన్న రంగు మొత్తం పోతుంది. ఆ తర్వాత వేడి నీరు, సబ్బుతో కడిగి ఆరబెట్టాలి.

2 / 6
మినీ ఫ్లవర్ వాజ్: చిన్న సైజులో ఉండే ఈ బాటిల్స్ చిన్న చిన్న పూల బొకేలకు సరిగ్గా సరిపోతాయి. బాటిల్ పైన గోల్డెన్ లేదా సిల్వర్ పెయింట్ వేసి, అందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంచితే అది మీ ఆఫీస్ టేబుల్‌కు కొత్త లుక్ ఇస్తుంది.

3 / 6
షోపీస్ మేకింగ్: బాటిల్ పైన గ్లిట్టర్ (Glitter) లేదా చిన్న ముత్యాలను అంటించండి. వీటిని గ్రూపుగా (మూడు లేదా ఐదు బాటిల్స్) ఒక ట్రేలో ఉంచితే అది ఒక అందమైన సెంటర్ పీస్ లాగా కనిపిస్తుంది.

4 / 6
మినీ పర్ఫ్యూమ్ బాటిల్స్: మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ లేదా హోమ్ మేడ్ పర్ఫ్యూమ్స్ నిల్వ చేసుకోవడానికి ఈ చిన్న బాటిల్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. వీటి పైన చిన్న రిబ్బన్ కడితే మరింత స్టైలిష్‌గా కనిపిస్తాయి.

5 / 6
ఆభరణాల హోల్డర్: డ్రెస్సింగ్ టేబుల్ పై చిన్న చిన్న పిన్నులు, రింగులు లేదా ఇయర్ స్టడ్స్ పోకుండా ఉండటానికి ఈ బాటిల్స్ ఉపయోగపడతాయి. పారదర్శకమైన బాటిల్స్ అయితే లోపల ఏముందో సులభంగా తెలుస్తుంది.

6 / 6
వేస్ట్ నుండి బెస్ట్ (Best out of waste) అనే సూత్రాన్ని పాటిస్తూ, మన సృజనాత్మకతకు పని చెబితే ఇటువంటి చిన్న వస్తువులతోనే ఇంటిని ఖరీదైన డెకర్ ఐటమ్స్ లాగా మార్చుకోవచ్చు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, మనకు నచ్చినట్లుగా వస్తువులను తయారు చేసుకున్న సంతృప్తి కలుగుతుంది.

Follow Us