Beauty Tips: కాస్ట్‌లీ ఫేస్‌ ప్యాక్‌ వద్దు.. నిమ్మకాయ తొక్కతో ఇలా చేస్తే.. ముఖం మిళ మిళ మెరవాల్సిందే!

Updated on: Apr 19, 2026 | 6:30 AM

వేసవి వచ్చింది ప్రతి ఇంట్లో చల్లగా నిమ్మరసం చేసుకొని తాగాలని చాలా మంది అనుకంటారు. మార్కెట్‌ నుంచి నిమ్మకాయలు తెచ్చి రసం చేసుకున్న తర్వాత వాటి తొక్కలనే పడేస్తుంటారు. కానీ, ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ సైతం ఇవ్వలేని లాభాలు ఈ తొక్క ఇస్తుందని చాలా మందికి తెలియదు.అవును నిమ్మకాయ తొక్కలో విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ నిగారింపును పెంచడంలో సూపర్‌గా పనిచేస్తాయి. కాబట్టి వీటితో చర్మ నిగారింపును ఎలా పెంచుకోవాలో చూద్దాం.

1 / 5
 ముఖాన్ని సహజమైన కాంతితో, గులాబీ రంగు మెరుపుతో ఉంచుకోవాలనుకునే వారికి నిమ్మతొక్కలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న నల్లని మచ్చలను తగ్గించి చెర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరిచి, ముఖానికి సహజమైన నిగారింపును అందిస్తాయి. నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి రాసుకుంటే మీ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడానికి సహాయపడుతాయి.

2 / 5
లెమన్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్:  లెమన్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు. ముందుగా నిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా నిమ్మ తొక్కల పొడి తీసుకొని అందులో 1 చెంచా తేనె, కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారంలో రెండు మూడు రోజులు చేస్తూ మీ స్కిన్ బ్రైట్‌గా మారుతుంది

3 / 5
తొక్కతో మసాజ్: పచ్చి తొక్కతో కూడా ముఖాన్ని మెరిపించుకోవచ్చు. ఇందుకోసం తాజా నిమ్మ తొక్క లోపలి భాగంలో కొంచెం చక్కెర లేదా తేనె వేసి.. దీనితో ముఖంపై మెల్లగా మసాజ్ చేయండి. ఇది టానింగ్‌ను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

4 / 5
స్కిన్ టోనర్: నిమ్మ తొక్కలను నీటిలో మరిగించి, ఆ నీటిని చల్లారనివ్వండి. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో ఉంచండి. రాత్రి పడుకునే ముందు ముఖంపై స్ప్రే చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. మార్నింగ్ లేచే వరకు ముఖం తాజాగా మారుతుంది.

5 / 5
అయితే నిమ్మరసం లేదా తొక్కలను వాడిన వెంటనే ఎండలోకి వెళ్లకండి. ఒక వేళ మీ చర్మం సున్నితంగా ఉంటే, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి. మంట పుట్టకుండా ఉండాలంటే నిమ్మ తొక్కలతో పాటు తేనె లేదా పెరుగు వంటి చల్లని పదార్థాలను కలిపి వాడటం మంచిది.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి. వీటిని TV9 ధృవీకరించడం లేదు

Follow Us