
ఉల్లి పాయలు కట్ చేయాలంటే చాలా మంది భయ పడి పోతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం. ఉల్లి పాయలు కట్ చేస్తున్నప్పుడు.. ఆ ఘాటుకు కంటి నుంచి నీరు వచ్చేస్తుంది. కళ్లు బాగా మండి పోతాయి. ఒక్కోసారి చేతులు కూడా కట్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఉల్లి పాయలు కట్ చేయడం ఓ టాస్క్‌గా భావిస్తారు.

యంగ్ ఏజ్‌లో ఉండే ఆడ పిల్లలు అయితే.. వాటి జోలికి కూడా వెళ్లరు. కానీ ఉల్లి పాయలు లేకుండా ఏ కూర కూడా ఫినిష్ కాదు. మరి ఉల్లి పాయలు తరిగేటప్పుడు కళ్లు మండకుండా ఉండాలన్నా.. నీళ్లు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

ఉల్లి పాయలు కట్ చేసేటప్పుడు తొక్క తీసి.. సాల్ట్ వాటర్‌లో ఓ రెండు నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత కట్ చేస్తే మీకు అస్సలు కంట్లో నుంచి నీళ్లు రావు. అలాగే కళ్లు కూడా మండవు.

ఉల్లిపాయలకు ఉన్న తొక్క తీసేసి.. రెండు బద్దలుగా కట్ చేసి.. చల్లని నీరు లేదా నార్మల్ వాటర్‌లో వేసి ఓ నిమిషం పాటు వదిలేయండి. ఇలా చేసినా కూడా కళ్లు మండకుండా, నీరు రాకుండా ఉంటాయి. సమయం ఉందనుకునే వాళ్లు ఉల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోవచ్చు.

అంతే కాకుండా ఫ్రిజ్‌లో ఉండే ఐస్ క్యూబ్స్‌ని వాటర్‌లో వేయండి. ఈలోపు మీరు ఉల్లి పాయలకు ఉన్న తొక్క తీసేసి ఆ వాటర్ లో వేయండి. ఇలా చేసినా కూడా కంటి నుంచి నీరు రాదు. అలాగే ఉల్లిపాయల్ని సగం కట్ చేసి కాసేపు వదిలేయండి. ఇలా చేసినా కళ్లు మండకుండా ఉంటాయి.