
ఎముకలు బలహీనపడటం, క్యాల్షియం లోపం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు శతపుష్పాలు అద్భుత పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ గింజలు అంత శక్తివంతమైనవి వీటిలో పాలు కంటే 12 రెట్లు అధికంగా, 100 గ్రాములకు 1516 మి.గ్రా క్యాల్షియం ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎముకల బలహీనత, క్యాల్షియం లోపం, కీళ్ల నొప్పులు నేటి రోజుల్లో చాలా మందిని, ముఖ్యంగా మహిళలను వృద్ధులను బాధిస్తున్నాయి. ఎముకలు గుల్లబారడం, పట్టు తప్పడం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా, ఎముకలను ఉక్కులా దృఢంగా మార్చే శక్తి శతపుష్పాలు గింజలకు ఉందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.

ఈ శతపుష్పాలు గింజల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే, వీటిలో క్యాల్షియం అత్యధిక స్థాయిలో ఉంటుంది. 100 గ్రాముల శతపుష్పాలు గింజలలో 1516 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది పాలలోని క్యాల్షియం కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఎముకల పుష్టికి, వాటి నిర్మాణానికి, అలాగే దంతాల ఆరోగ్యానికి క్యాల్షియం చాలా అవసరం.

క్యాల్షియం లోపాన్ని నివారించి, ఎముకలను బలంగా ఉంచడంలో శతపుష్పాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే, ఈ సమాచారం కేవలం ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా దీనిని ఉపయోగించకండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి.

ఈ గింజలు చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళకి ఇలా ఉపయోగపడతాయని కూడా తెలియదు. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)