ముఖంపై మొటిమలను గిల్లకూడదు. తరచూ చేతులను ముఖానికి తాకిస్తుంటే చేతులకు ఉండే బ్యాక్టీరియా మారింత వ్యాపించే అవకాశం ఉంది. అలాగే మొటిమలను గిల్లటం, గోకటం, నొక్కటం వంటివేవీ చేయకూడదు. ఇలా చేస్తే బ్యాక్టీరియా మరింత లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్కు అధికం కావచ్చు.
మొటిమలు తగ్గటానికి మెడికల్ షాపుల్లో దొరికే లేపనాలు, మందులు వాడుకోవచ్చు. వీటిల్లో బెంజైల్ పెరాక్సైడ్, శాలిసైలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను నిర్మూలించి చర్మానికి మేలు చేస్తాయి
రోజు చివరిలో మేకప్ తీయకుండా పడుకునే అలవాటు అస్సలు మంచిది కాదు. మీరు చర్మానికి సీరమ్ అప్లై చేయకపోయినా పర్వాలేదుగానీ మేకప్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించి పడుకోవాలి. రోజూ బయటికి వెళ్లేవారు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయలేదంటే పెద్ద తప్పు చేస్తున్నట్లే. సన్‌స్క్రీన్ సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. సన్‌స్క్రీన్ లేకుండా సూర్యరశ్మికి గురికావడం చర్మ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి.
జుట్టుకు పోషణను అందించడానికి షాంపూ చేయడానికి ముందు రాత్రి పడుకునే ముందు నూనె రాసుకుని, రాత్రంతా నూనె తలతో నిద్రించడం వల్ల చర్మంపై మొటిమల సమస్య పెరుగుతుంది. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు నూనెను రాసుకుంటే సరిపోతుంది.దిండు కవర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దిండు కవర్లు, షీట్లు అపరిశుభ్రంగా ఉంటే అక్కడి నుంచి చర్మ సమస్యలు పెరుగుతాయి. ప్రతి రెండు మూడు రోజులకోసారి దిండు కవర్లు, బెడ్ షీట్లను మార్చుకోవాలి.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మద్యపానం, ధూమపానం మానేయాలి. ఈ చెడు అలవాట్లు ఊపిరితిత్తులు, కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అవి చర్మాన్ని కూడా హాని తలపెడతాయి. కాబట్టి ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.