అన్నం, పులిహోర కన్నా 5 రెట్లు ఎక్కువ.. గిన్నెడు తిన్నవాళ్ళు కళ్ళ జోడుకు బై బై చెప్పాల్సిందే

Updated on: Oct 31, 2026 | 5:41 PM

లంచ్ బాక్స్ కోసం ఆరోగ్యకరమైన, రుచికరమైన, సులభంగా తయారు చేసుకోదగిన వంటకాన్ని ఎప్పుడైనా చేసుకున్నారా? అయితే కరివేపాకు రైస్ లేదా కరివేపాకు పులిహోర మీకు సరైన ఎంపిక. సాధారణ పులిహోరల కంటే భిన్నంగా ఉండే ఈ వంటకం, అద్భుతమైన రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

1 / 5
కావాల్సిన పదార్దాలు : కరివేపాకు: 2 కప్పులు (శుభ్రం చేసుకుని),  నూనె: 3-4 టేబుల్ స్పూన్లు, పల్లీలు: కొన్ని, పచ్చి శనగపప్పు: 1 టేబుల్ స్పూన్,  మినప గుళ్ళు: 1 టేబుల్ స్పూన్,  ఆవాలు: 1 టీ స్పూన్,  జీలకర్ర: 1/2 టీ స్పూన్, జీడిపప్పు: కొన్ని,  ఎండుమిర్చి: 2 , 
  పచ్చిమిర్చి: 5-6 (రుచికి తగ్గట్టు),  కరివేపాకు: కొంచెం (పోపు కోసం),   ఇంగువ: 1/4 టీ స్పూన్,  పసుపు: 1/2 టీ స్పూన్,  ఉప్పు: రుచికి సరిపడా,  నిమ్మరసం: 1 పెద్ద నిమ్మకాయ నుండి, అన్నం: 1 కప్పు బియ్యంతో వండినది తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు : కరివేపాకు: 2 కప్పులు (శుభ్రం చేసుకుని), నూనె: 3-4 టేబుల్ స్పూన్లు, పల్లీలు: కొన్ని, పచ్చి శనగపప్పు: 1 టేబుల్ స్పూన్, మినప గుళ్ళు: 1 టేబుల్ స్పూన్, ఆవాలు: 1 టీ స్పూన్, జీలకర్ర: 1/2 టీ స్పూన్, జీడిపప్పు: కొన్ని, ఎండుమిర్చి: 2 , పచ్చిమిర్చి: 5-6 (రుచికి తగ్గట్టు), కరివేపాకు: కొంచెం (పోపు కోసం), ఇంగువ: 1/4 టీ స్పూన్, పసుపు: 1/2 టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నిమ్మరసం: 1 పెద్ద నిమ్మకాయ నుండి, అన్నం: 1 కప్పు బియ్యంతో వండినది తీసుకోవాలి.

2 / 5
ముందుగా రెండు కప్పుల కరివేపాకును ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఈ కరివేపాకును మిక్సీ జార్‌లోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా పోయకుండా చూసుకోవాలి. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి, మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత పల్లీలు వేసి కొద్దిగా వేయించాలి. పల్లీలు సగం వేగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప గుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసి తక్కువ మంటపై బాగా వేయించాలి.

3 / 5
పోపు దినుసులు వేగిన తర్వాత జీడిపప్పు, తుంచిన ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చిని మొదట వేస్తే నల్లగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి, ఇతర దినుసులు వేగిన తర్వాతే కలపాలి. జీడిపప్పు, ఎండుమిర్చి వేగిన తర్వాత, ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి  కొంచెం కరివేపాకు వేసి పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ, అర టీ స్పూన్ పసుపు వేసి ఒక్క నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.

4 / 5
 ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్‌ను పాన్‌లో వేయాలి. తక్కువ మంటపై, పచ్చివాసన పోయి, పేస్ట్ నుండి నూనె పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పేస్ట్ బాగా వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేయండి.

5 / 5
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, రుచికి సరిపడినంత ఉప్పు , ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలపాలి. ఉప్పు, నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కలపడం మంచిది. ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి, ఒక టీ స్పూన్ నూనె వేసి, మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసి కొద్దిగా ఆరనివ్వాలి. అన్నం వేడి తగ్గిన తర్వాత, ఈ కరివేపాకు పేస్ట్‌లో వేసి బాగా కలపాలి. స్పూన్‌తో కంటే చేతితో కలిపితే పేస్ట్ అన్నానికి చక్కగా పడుతుంది. కరివేపాకు జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరగాయలు లేని రోజులలో ఇది మంచి ఎంపిక. అలాగే, రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ కరివేపాకు రైస్‌తో పాటు ఆనియన్ రైతా, కొన్ని క్యారెట్ ముక్కలు పెడితే పిల్లలు ఇష్టపడి తింటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us