Sorakaya Bajji: 5 నిమిషాల్లో కరకరలాడే ‘సొరకాయ బజ్జీ’.. చల్లని సాయంత్రం వేళ టీతో తింటే ఆ మజానే వేరు!

Updated on: Aug 27, 2026 | 9:51 PM

సాయంత్రం వేళల్లో ఆకాశం చల్లబడినప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా టీ, కాఫీ తాగుతూ కరకరలాడే బజ్జీలు తినాలనిపించడం సహజం. సాధారణంగా బజ్జీలు అనగానే అందరికీ మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ లేదా అరటికాయ బజ్జీలు గుర్తొస్తాయి. అయితే వీటికి భిన్నంగా లేత సొరకాయతో అప్పటికప్పుడు కేవలం ఐదే నిమిషాల్లో ఎంతో రుచికరమైన 'సొరకాయ బజ్జీ'లను సులభంగా తయారు చేసుకోవచ్చు.

1 / 5
పైన ఎంతో క్రిస్పీగా, లోపల జ్యూసీగా మెత్తగా ఉండే ఈ బజ్జీలను బ్యాచిలర్స్ సైతం వంటింట్లో దొరికే వస్తువులతో చిటికెలో చేసేయవచ్చు. ఆ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
దీనికి కావలసిన పదార్థాలు: ఒకటి - మీడియం సైజు లేత సొరకాయ, ముప్పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి,ఒక టీస్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్  వాము, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు మరియు డీప్ ఫ్రైకి సరిపడా నూనె.

పైన ఎంతో క్రిస్పీగా, లోపల జ్యూసీగా మెత్తగా ఉండే ఈ బజ్జీలను బ్యాచిలర్స్ సైతం వంటింట్లో దొరికే వస్తువులతో చిటికెలో చేసేయవచ్చు. ఆ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒకటి - మీడియం సైజు లేత సొరకాయ, ముప్పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి,ఒక టీస్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్  వాము, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు మరియు డీప్ ఫ్రైకి సరిపడా నూనె.

2 / 5
సొరకాయ ముక్కల తయారీ: ముందుగా లేత సొరకాయను తీసుకుని తొక్క తీసి శుభ్రంగా కడగాలి. దీనిని మరీ పలుచగా కాకుండా, మరీ లావుగా కాకుండా సమానమైన గుండ్రటి చక్రాల్లా కోసుకోవాలి. ఒక పాత్రలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి, ఈ సొరకాయ ముక్కలను అందులో 5 నుండి 10 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకు ఉప్పు పట్టి బజ్జీలు మరింత రుచిగా వస్తాయి.

3 / 5
బజ్జీల పిండి కలపడం: ఒక మిక్సింగ్ బౌల్‌లోకి శనగపిండి, బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు నూనె పీల్చకుండా ఎక్కువసేపు కరకరలాడతాయి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేయాలి. చివరగా వామును అరచేతిలో నలిపి వేయాలి. వాము మంచి సువాసనతో పాటు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలా చిక్కగా కలుపుకోవాలి.

4 / 5
వేయించే విధానం: సొరకాయ ముక్కలను ఉప్పునీటిలో నుంచి తీసి తడి తుడవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క సొరకాయ ముక్కను శనగపిండి మిశ్రమంలో రెండు వైపులా ముంచి నూనెలో నిదానంగా వేయాలి.

5 / 5
మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడివేడి సొరకాయ బజ్జీలు సిద్ధం! టమాటా సాస్ లేదా పల్లి చట్నీతో తింటే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా లాగించేస్తారు!

Loading...
Unable to load recommendations.
Follow Us