
అలసంద వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు అలసందలు, మూడు కప్పులు ఉల్లిపాయలు, 50 గ్రాములు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక కప్పు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఈ వడలను కాల్చడానికి సరిపడా నూనెను తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే రుచిగా ఉంటుంది.

బొబ్బర్లు వడల తయారీ విధానం ముందుగా అలసందలు తీసుకుని నానబెట్టుకోవాలి. అయితే, వీటిని కనీసం 8 గంటల పాటు నీటిలో బాగా నానబెట్టాలి. అ తర్వాత ఈ నానిన అలసందలను తీసుకుని మిక్సీలో కానీ, రోటిలో వేసి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి అట్టు పిండి లాగా చెయ్యకండి. ఇంకా దీనిలో కొద్దిగా నీళ్ళు పోసి రెండో సారి కూడా మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి.

ఈ మిశ్రమంలో వీటిని తీసుకుని కలుపుకోవాలి : అయితే, దీనిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని ఈ పేస్ట్ మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసి వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే అలసంద వడలు టేస్టీగా వస్తాయి కర కర లాడుతూ రుచిగా ఉంటాయి.

ఈ అలసంద వడలను ఇలా వేయించుకోవాలి : ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ఆ అలసంద పిండిని తీసుకుని ఆలాగే నీరు రాసుకుని చిన్న వడలుగా చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసి వేడి అయ్యాక మీడియం మంటపై వడలను గోల్డ్ కలర్లోకి మారే వరకు వీటిని బాగా వేయించాలి. ఈ వేడి వేడి వడలను కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతోంది.

ఈ అలసంద వడలు కొందరికి గ్యాస్ సమస్యలు వచ్చేలా చేస్తాయి కాబట్టి, వీరు ఎక్కువగా తినకండని చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)