2021 Rewind: ‘మ్యాటర్ ఏదైనా సోషల్ మీడియాలో మాదే హల్‌చల్’.. 2021లో సత్తా చాటిన క్రికెటర్లు ఎవరంటే?

|

Dec 16, 2021 | 1:33 PM

ఇక 2021లో ఎక్కువగా సోషల్ మీడియాలో శోధించిన లేదా ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తులను ఓసారి చూద్దాం.

1 / 10
Top 9 Sports Celebrities: కోవిడ్‌తో అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లే క్రీడారంగం కూడా చాలా లోతుపాట్లను చవిచూసింది. ఎన్నో పోటీలు వాయిదా పడగా, కొన్నింటిని మాత్రం ప్రత్యేక పరిస్థితుల మధ్య నిర్వహించారు. ఇక ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే కొంత పర్వాలేదనిపించినా.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇక 2021లో విషయం ఏదైనా సరే ఈ క్రికెటర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో శోధించిన లేదా ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తులను ఓసారి చూద్దాం.

2 / 10
రిషబ్ పంత్: రిషబ్ పంత్‌కు 2021 సంవత్సరం ఎంతో కలిసివచ్చిందనే చెప్పాలి. ఐపీఎల్ 2021లో శ్రేయాస్ అయ్యర్ గాయంతో తప్పుకోవడంతో, ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు సారథిగా మారాడు. టీంను లీగ్ దశ నుంచి నాకౌట్ వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే రిషబ్ పంత్ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్టంపింగ్ (9) చేసిన వికెట్ కీపర్‌లలో నంబర్‌ వన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా అత్యుత్తమ వికెట్ కీపర్లలో టాప్‌ 3లో నిలిచాడు. ఇక 2021లో మొత్తం 11 మ్యాచుల్లో 706 పరుగులు సాధించాడు. ఇందులో 101 పరుగుల అత్యధిక స్కోర్‌ సాధించాడు. ఢిల్లీ తరపున రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో అత్యధిక పారితోషకం(రూ. 16 కోట్లు) తీసుకోనున్న ప్లేయర్‌గాను రికార్డు సాధించాడు.

3 / 10
రోహిత్ శర్మ: రోహిత్ శర్మకు  ఈ ఏడాది బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. ఫాంలో ఉన్న రోహిత్, కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు ప్రకటించగానే అమాంతం హాట్ టాపిక్‌గా మారాడు. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌ను కైవసం చేసుకుని తొలి సిరీస్‌లోనే కెప్టెన్‌గా విజయవంతంగా నిరూపించుకున్నాడు. అలాగే వన్డే కెప్టెన్సీని కూడా దక్కించుకున్న రోహిత్, దక్షిణాఫ్రికాలో రాణించేందుకు  ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు ద్రవిడ్‌తో కలిసి టీమిండియాకు కొత్త శకాన్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

4 / 10
విరాట్ కోహ్లీ: విరాట్ కోహ్లీకి 2021 మొదటి భాగం బాగానే కొలిసొచ్చింది. అయితే, చివర్లో మాత్రం మీడియాలో హాట్‌టాపిక్‌గా మారేలా చేసింది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడంతో పాటు, టీమిండియాను డబ్ల్యూసీ ఫైనల్ చేర్చడంలో విజయవంతమయ్యాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోవడం, టీ20 ప్రపంచకప్‌లోనూ టీమిండియా నిరాశపరచడంతోపాటు వన్డే కెప్టెన్సీని వదులుకోవడం ఇలా చాలా విషయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాడు. అలాగే విరాట్ డాటర్‌పై కూడా బెదిరింపులు రావడం కలకలం రేపింది.

5 / 10
మహ్మద్ సిరాజ్:  టీమిండియా పేస్ బౌలర్  మహ్మద్ సిరాస్‌కి కూడా 2021 ఏడాదిలో మిశ్రమ ఫలితాలను అందించింది. ఈ ఏడాది మొదట్లోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సిరాజ్.. తన తండ్రి మరణాన్ని కూడా దిగమింగుకొని మ్యాచ్ ఆడాడు. మొత్తంగా 10 మ్యాచులు ఆడిన సిరాజ్ 29 వికెట్లు పడగొట్టాడు. బ్రిస్బేన్‌లో జరిగిన టెస్ట్‌లో 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక టీ20ల్లో 100 వికెట్లను కూడా పూర్తి చేసుకున్నాడు.

6 / 10
డేవిడ్ వార్నర్: ఇక డేవిడ్ వార్నర్‌కు ఈ ఏడాది ఎంతో చెడ్డదిగా మిగిలింది. ఐపీఎల్ 2021లో హైదరాబాద్‌ సారథిగా అనూహ్య పరిణామాలతో తన పదవిని కోల్పోయాడు. ఆ తరువాత ప్లేయింగ్ XIలోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక మెల్లగా టీం నుంచి కూడా బయటకు వచ్చేలా పరిస్థితులు మారాయి. మొత్తంగా పేలవమైన ఫాంతో తంటాలు పడిన డేవిడ్ వార్నర్ డకౌట్‌‌లవుతూ నిరాశలో మునిగిపోయాడు. కానీ, టీ20 ప్రపంచకప్‌లో 7 మ్యాచుల్లో 289 పరుగులు సాధించిన రెండో స్థానంలో నిలిచి తన టీంకు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

7 / 10
మ్యాక్స్ వెల్: మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2021లో ఆర్‌సీబీ తరపున మొత్తం 15 మ్యాచుల్లో 513 పరుగులు సాధించి టాప్‌ 5లో నిలిచాడు. గత ఏడాది లీగ్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా బాదకుండా పేలవ ఫాంతో తంటాలు పడిన మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది అద్భుతంగా పుంజుకుని(21 సిక్సులు) సత్తా చాటాడు.

8 / 10
కేఎల్ రాహుల్: కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2021లో మొత్తం 13 మ్యాచుల్లో 626 పరుగులు సాధించి, టాప్‌ 3లో నిలిచాడు. ఇక అంతర్జాతీ క్రికెట్‌లోనూ 18 మ్యాచులు ఆడిన రాహుల్ 781 పరుగులతో సత్తా చాటాడు. అయితే అనూహ్యంగా పంజాబ్ టీం నుంచి వైదొలగడంతో వార్తల్లోకి ఎక్కాడు. ఇక చేసేదేంలేక పంజాబ్ టీం కూడా రాహుల్‌ను విడుదల చేసింది. అప్పటికే లక్నో టీంతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే 2022లో లక్నో సారథిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే ఏడాది తన ప్రేయసి(సినీ యాక్టర్ అథియా శెట్టి)ని కూడా తన అభిమానులకు పరిచయం చేసి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాడు.

9 / 10
2021 Rewind: ‘మ్యాటర్ ఏదైనా సోషల్ మీడియాలో మాదే హల్‌చల్’.. 2021లో సత్తా చాటిన క్రికెటర్లు ఎవరంటే?

10 / 10
పాట్ కమిన్స్: కొన్నాళ్ల కిందట ఓ మహిళకు అసభ్య సందేశాలు పంపినట్లు నిరూపితమవడంతో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి టీమ్ పైన్ తప్పుకోవడంతో అనూహ్యంగా బౌలర్ పాట్ కమిన్స్ సారథిగా మారాడు. ఆసీస్ టీంకు 47వ కెప్టెన్‌గా మారిన కమిన్స్, జట్టు పగ్గాలు చేపట్టిన రెండో ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే సారథిగా మారిన వెంటనే యాషెస్ సిరీస్‌ తొలి మ్యాచులో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. 127 సంవత్సరాల రికార్డును సమం చేశాడు.