T20 World Cup 2022: భారత విజయంలో 5 అద్భుత క్షణాలు.. చూస్తే మీరు కూడా భావోద్వేగంలో ముగినిపోతారంతే..

|

Oct 24, 2022 | 2:15 PM

ఆదివారం భారత్‌కు 10 వేల కిలోమీటర్ల దూరంలోని మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో పాకిస్థాన్‌ను టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడించిన సమయంలో.. చాలా మంది ఆటగాళ్లు తమ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు.

1 / 6
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది సాధారణ క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, ప్రజల భావోద్వేగాలతోనూ ముడిపడి ఉంటాయి. ఇది కేవలం అభిమానులకే కాదు, పోటీలో పాల్గొనే క్రీడాకారులకు కూడా. ఆదివారం భారత్‌కు 10 వేల కిలోమీటర్ల దూరంలోని మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో పాకిస్థాన్‌ను టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడించిన సమయంలో.. చాలా మంది ఆటగాళ్లు తమ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. కొందరి కళ్లలో నీళ్లు, మరికొందరు కౌగిలింతలతో తమ భావోద్వేగాలను పంచుకున్నారు. అలాంటి అత్యుత్తమ క్షణాలను ఓ సారి గుర్తు చేసుకుందాం..

2 / 6
1. విజయం తర్వాత కన్నీళ్లు పెట్టిన కోహ్లీ.. విరాట్ కోహ్లీ 12 ఏళ్లుగా T20 క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, అతను చాలా అరుదుగా ఉద్వేగభరితంగా కనిపించాడు. పాకిస్థాన్‌పై 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఈ ఆటగాడికి కన్నీళ్లు వచ్చాయి. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అతని కోసం ట్వీట్ చేస్తూ, 'నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి విరాట్ కోహ్లీని చూస్తున్నాను. ఆయన కన్నీళ్లను నేను ఎప్పుడూ చూడలేదు, కానీ, ఈ రోజు చూస్తున్నాను. ఇది ఎప్పటికీ మర్చిపోలేని క్షణం' అంటూ చెప్పుకొచ్చాడు.

3 / 6
2. విరాట్‌ను భుజాలపై ఎత్తుకున్న రోహిత్.. టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అతనికి చాలా కీలకమైంది. 31 పరుగులకే టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 82 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అశ్విన్ విజయం కోసం చివరి పరుగు సాధించినప్పుడు, రోహిత్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి విరాట్ కోహ్లీని తన భుజాలపై ఎత్తుకున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అదరగొట్టారు.

4 / 6
3. కన్నీళ్లు పెట్టిన హార్దిక్.. హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీల సెంచరీ భాగస్వామ్య ఫలితమే భారత జట్టు మ్యాచ్‌ను గెలవగలిగింది. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం ఉంది. మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన తండ్రిని కూడా గుర్తు చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, '10 నెలల క్రితం నేను ఎక్కడ ఉన్నానో, ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసు. ఇది నాకు చాలా పెద్ద విషయం అని పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రాహుల్‌తో చెప్పాను. ఈ ఇన్నింగ్స్ మా నాన్న కోసమే. అతను ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉండేవాడు. ఆడే అవకాశం రాకపోతే ఇక్కడ ఎలా నిలబడతాను. నాన్న నాకు ఆడే అవకాశం కల్పించాడు. ఎన్నో త్యాగాలు చేశాడు. మాకోసం వేరే ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అన్నదమ్ములిద్దరం ఆరేళ్ల వయసులో నగరాన్ని వచ్చేశాం. నాన్నకు నేనెప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను' అని చెప్పుకొచ్చాడు. ఇలా చెప్పి కెమెరా ముందు ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో హార్దిక్‌తో పాటు ఉన్న ఇర్ఫాన్ పఠాన్.. అతడిని కౌగిలించుకుని ఓదార్చాడు.

5 / 6
4. హైదర్ అలీకి కౌంటర్ ఇచ్చిన హార్దిక్.. మ్యాచ్ మొదటి ఓవర్ నుంచి భారత బౌలర్ల ఫైరింగ్‌తో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్స్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 14వ ఓవర్ చివరి బంతిని హార్దిక్ పాండ్యా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్ ఆఫ్ స్టంప్‌లో ఔట్ చేశాడు. హైదర్ అలీ ఈ బంతిని బౌండరీ వెలుపల పంపాలనుకున్నాడు. బంతికి ఎత్తు వచ్చింది. కానీ, డీప్‌ మిడ్‌ వికెట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. హైదర్ అలీని ఔట్ చేసిన తర్వాత హార్దిక్ తన హావభావాలతో కవ్వించాడు. ఈ స్టైల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

6 / 6
5. విరాట్‌ను కౌగిలించుకున్న ద్రవిడ్.. చివరి బంతికి భారత జట్టు విజయానికి 1 పరుగు అవసరం. రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సింగిల్ తీసిన వెంటనే భారతీయ మద్దతుదారులందరిలో సంబరాలు మొదలయ్యాయి. ఈ విజయం తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందన కూడా చూడాల్సిందే. 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. అదే సమయంలో విరాట్ కూడా చిన్న పిల్లాడిలా ద్రావిడ్ ఛాతీకి అతుక్కుపోయాడు.