
ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చే దేశాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. దీని ప్రకారం 2025 ఆసియా కప్ టోర్నీ భారత్‌లో జరగనుంది. 2026 టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు వచ్చే ఏడాది కూడా టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.

2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు 2027 ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో ఆడనుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.

అలాగే 2029 ఆసియా కప్ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. 2030లో టీ20 ప్రపంచకప్ జరగనుండగా, అంతకంటే ముందు ఆసియాకప్ జరగనుంది. అలాగే, 2029 ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఆసియా కప్ 2031లో వన్డే కప్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఎందుకంటే 2031లో భారత్, బంగ్లాదేశ్‌లలో వన్డే ప్రపంచకప్ జరగనుండగా, అంతకంటే ముందు శ్రీలంకలో వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించడమే ఇందుకు కారణం.

దీని ప్రకారం వచ్చే 7 ఏళ్లలో 4 ఆసియా కప్ టోర్నీలు జరగనున్నాయి. ఈ మధ్యలో మూడు టీ20 ప్రపంచకప్‌లు, రెండు వన్డే ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగనున్నాయి. తద్వారా వచ్చే ఏడేళ్లలో క్రికెట్ ప్రేమికులకు ఫుల్ మజా అందనుంది.