Heath Streak: హీత్ స్ట్రీక్‌కే సొంతమైన 5 రికార్డులు.. జింబాబ్వే మాజీ కెప్టెన్ ఖాతాలో సచిన్, జయసూర్య వికెట్లు..

|

Sep 04, 2023 | 9:22 AM

Heath Streak: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ క్యాన్సర్‌తో బాధపడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సెప్టెంబర్ 3న ఉదయం స్ట్రీక్ మరణించినట్లు ఆయన భార్య నాడిన్ తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జింబాబ్వే క్రికెట్ ‘గోల్డెన్ ఎరా’లో భాగమైన హీత్ స్ట్రీక్ కెరీర్ అద్భుతమైన రీతిలో సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచ క్రికెట్‌కి జింబాబ్వే అందించిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో హీత్ స్ట్రీక్ ఒకరు. అలాంటి స్ట్రీక్‌కి మాత్రమే సొంతమైన రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..

1 / 5
జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హీత్ స్ట్రీక్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించారు. జింబాబ్వే తరఫున 1993-2005 మధ్య కాలంలో 65 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన స్ట్రీక్ మొత్తం 216 వికెట్లు తీశాడు. జింబాబ్వే తరఫున స్ట్రీక్ మినహా మరే ఇతర ఒక్కరూ రెడ్-బాల్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 100 వికెట్లు కూడా తీయలేకపోయాడు.

2 / 5
వన్డే క్రికెట్‌లో కూడా స్ట్రీక్ తనదైన ముద్ర వేశారు. జింబాబ్వే తరఫున టెస్టుల్లో మాదిరిగానే వన్డేల్లో కూడా  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానే స్ట్రీక్ తన కెరీర్‌ని ముగించారు. ఇంకా చెప్పాలంటే.. జింబాబ్వే తరఫున 237 వికెట్లు తీసిన స్ట్రీక్ మినహా ఏ ఒక్కరూ 200 కంటే ఎక్కువ వికెట్లు తీయలేదు.

3 / 5
స్ట్రీక్ 1996, 1999, 2003 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడిన స్ట్రీక్ మెరుగైన ప్రదర్శన చేయడంతో పాటు మొత్తం 22 వికెట్లను పడగొట్టాడు. 1996 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య వంటి దిగ్గజాలను తక్కువ స్కోర్‌కే ఔట్ చేసిన స్ట్రీక్.. ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన 1999 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌పై 36/3, సౌతాఫ్రికాపై 35/3 ప్రదర్శనతో మెప్పించాడు.

4 / 5
జింబాబ్వే తరఫున టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగులు చేసి, 100 వికెట్లు తీసుకున్న ఒకే ఒక్క ఆటగాడు హీత్ స్ట్రీక్. ఈ ఆటగాడు తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 1990 రన్స్ చేయడంతో పాటు 216 వికెట్లు పడగొట్టాడు.

5 / 5
అలాగే జింబాబ్వే వన్డే క్రికెట్‌లో  కూడా 2500 పరుగులు చేసి 200 వికెట్లు పడగొట్టిన ఒకే ఒక్కడు స్ట్రీక్. 189 వన్డేలు ఆడిన స్ట్రీక్ తన కెరీర్‌లో 2943 పరుగులు చేయడంతో పాటు 239 వికెట్లు తీశాడు.