T20I Cricket: నో కోహ్లీ, నో గేల్.. అత్యంత వేగంగా ‘టీ20 సెంచరీ’ చేసిన ఆటగాళ్లు వీరే..

|

Sep 27, 2023 | 5:28 PM

T20I Cricket Centuries: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా 2023 ఆసియా క్రీడలు జరుగుతుండగా.. ప్రారంభ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో నేపాల్, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మంగోలియాపై నేపాల్ 273 పరుగుల తేడాతో గెలవగా.. నేపాలీ బ్యాటర్ కుశల్ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ.. 50 బంతుల్లోనే 137* పరుగులు చేశాడు. ఇంకా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన టాప్ 5 ఆటగాళ్ల లిస్టులో అతని తర్వాత ఎవరెవరు ఉన్నారంటే..?

1 / 5
T20I Cricket Centuries: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నేపాల్‌కు చెందిన కుశల్ మల్ల అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కుశల్ 34 బంతుల్లోనే సెంచరీ చేయడమే కాక.. 50 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచాడు.

2 / 5
అత్యంత వేగంగా అంతర్జాతీయ టీ20 సెంచరీ నమోదు చేసుకున్న ఆటగాడిగా సౌతాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ రెండో స్థానంలో ఉన్నాడు. మిల్లర్ 2017 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

3 / 5
ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. మిల్లర్ మాదిరిగానే 2017లోనే రోహిత్ కూడా 35 బంతుల్లో టీ20 సెంచరీ చేశాడు. అయితే మిల్లర్ అక్టోబర్‌లో సెంచరీ చేయగా.. డిసెంబర్‌లో రోహిత్ చేశాడు. దీంతో ఈ లిస్టులో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.

4 / 5
సిజెక్ రిపబ్లిక్‌కి చెందిన సుదేశ్ విక్రమసేకర ఈ లిస్టు నాల్గో స్థానంలో ఉన్నాడు. సుదేశ్ 2019 ఆగస్టులో టర్కీపై 36 బంతుల్లో సెంచరీ చేశాడు.

5 / 5
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన టాప్ 5 ఆటగాళ్ల లిస్టులో రోమానియాకు చెందిన శివకుమార్ పెరియాల్వర్ ఐదో స్థానంలో ఉన్నాడు. టర్కీతో 2019 ఆగస్టులో జరిగిన టీ20 మ్యాచ్‌లో శివకుమార్ 39 బంతుల్లో సెంచరీ సాధించి, ఈ లిస్టులో స్థానం పొందాడు.