IND vs PAK: ఇండో-పాక్ టీ20 మ్యాచ్‌లలో టాప్ స్కోరర్ ఎవరో తెలుసా? టాప్-5లో ఉన్నది వీరే..

| Edited By: Anil kumar poka

Oct 23, 2022 | 9:56 AM

భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు 11 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ చేసినవే కావడం గమనార్హం.

1 / 6
IND vs PAK T20 Records: భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు 11 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ చేసినవే కావడం గమనార్హం.

2 / 6
ఇండో-పాక్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 9 మ్యాచ్‌ల్లో 406 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ బ్యాటింగ్ సగటు 67.66, స్ట్రైక్ రేట్ 119.06గా నిలిచింది. పాకిస్థాన్‌పై విరాట్ 4 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

3 / 6
ఇండో-పాక్ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు మహ్మద్ రిజ్వాన్. రిజ్వాన్ మూడు మ్యాచ్‌ల్లో 193 పరుగులు చేశాడు. భారత్‌పై రిజ్వాన్ బ్యాటింగ్ సగటు 96.50, స్ట్రైక్ రేట్ 130.40గా ఉంది.

4 / 6
పాకిస్థాన్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఇక్కడ మూడో స్థానంలో ఉన్నాడు. షోయబ్ భారత్‌తో ఆడిన 9 మ్యాచ్‌లలో 27.33 బ్యాటింగ్ సగటు, 103.79 స్ట్రైక్ రేట్‌తో 164 పరుగులు చేశాడు. ఆసియా కప్ 2022కి ముందు షోయబ్ మాలిక్ ఇండో-పాక్‌ల ప్రతి మ్యాచ్‌లో భాగమయ్యాడు.

5 / 6
ఇండో-పాక్ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బౌలర్లలో మహ్మద్ హఫీజ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. హఫీజ్ 8 మ్యాచ్‌లలో 26 బ్యాటింగ్ సగటు, 118.18 స్ట్రైక్ రేట్‌తో 156 పరుగులు చేశాడు.

6 / 6
టాప్-5లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన 8 టీ20 మ్యాచ్‌ల్లో యువరాజ్ 25.83 బ్యాటింగ్ సగటు, 109.92 స్ట్రైక్ రేట్‌తో 155 పరుగులు చేశాడు. ఇండో-పాక్ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ కూడా యువరాజ్. అతను 9 సిక్సర్లు కొట్టాడు.