ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 తర్వాత.. టీమిండియా క్రికెటర్లు ఫుల్ బిజీలో ఉండబోతున్నారు. అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు కంటిన్యూగా మైదానంలో కనిపించనుంది. మంగళవారం ఆస్ట్రేలియా తన షెడ్యూల్‌ను ప్రకటించింది. దాని ప్రకారం టీమిండియాతో కూడా ఓ సిరీస్ ఆడనుంది.
ఆస్ట్రేలియా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్‌లో భారత్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. T20 ప్రపంచ కప్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని, ఆ కోణంలో ఈ సిరీస్ టీమ్ ఇండియాకు గొప్ప 'టెస్ట్' లాంటిదని భావిస్తున్నారు.
IPL 2022 తర్వాత, జూన్ 9 నుంచి టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో వారి తలపడుతుంది. ఈ టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. దీని తర్వాత జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్ జులై 7న, వన్డే సిరీస్ జులై 12న ప్రారంభం కానుంది.
జులై 22 నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జులై 29 నుంచి విండీస్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆగస్టు 7న జరగనుంది.