IND vs ENG 1st Test: సరికొత్త రికార్డ్ సృష్టించిన ఆశ్విన్.. డబ్ల్యూటీసీలో నంబర్ వన్ బౌలర్‌గా..

|

Jan 27, 2024 | 1:05 PM

R Ashwin Records: రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 494 వికెట్లు తీసిన అశ్విన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 6 వికెట్లు తీస్తే సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీలో చరిత్ర సృష్టించాడు. కాగా, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ రికార్డ్‌ను వెనక్కునెట్టేశాడు.

1 / 5
హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 21 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 68 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

2 / 5
ఈ మూడు వికెట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 150 వికెట్లు తీసిన మూడో బౌలర్, రెండో స్పిన్నర్‌గా నిలిచాడు. అంతే కాకుండా, అతను WTCలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉన్నాడు.

3 / 5
ఇంతకు ముందు ఈ ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ లియాన్ పేరిట ఉండేది. లియాన్ 63 టెస్టు మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీశాడు. ఈ రికార్డును ఇప్పుడు అశ్విన్ చెరిపేశాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం 58 టెస్టు మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పూర్తి చేశాడు. దీని ద్వారా డబ్ల్యూటీసీలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

4 / 5
టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసేందుకు రవిచంద్రన్ అశ్విన్‌కు కేవలం 7 వికెట్లు మాత్రమే అవసరం. 180 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన అశ్విన్ 494 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌పై 6 వికెట్లు తీస్తే టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన 2వ భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

5 / 5
భారత్‌కు భారీ ఆధిక్యం: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేసింది. 72 పరుగుల వెనుకంజలో నిలిచింది.